Janasena TDP Vs YSRCP వై నాట్ 175 అంటోంది వైసీపీ.! అలాంటప్పుడు, ఇంకో రాజకీయ పార్టీకి భయపడాల్సిన అవసరమేముంది.?
మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) పేరుని ప్రస్తావించాలంటేనే, వైసీపీ అధినేతకు వెన్నులో వణుకు బయల్దేరుతోంది.!
అందుకే, ‘దత్త పుత్రుడు’ అనీ, ఇంకోటనీ.. వైఎస్ జగన్ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) ఏవేవో మాటలు చెబుతుంటారు.!
ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి నోట ‘దత్త పుత్రుడు’, ‘ప్యాకేజీ స్టార్’, ‘మ్యారేజ్ స్టార్’ అనే మాట వినాల్సి రావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలేమో.!
Janasena TDP Vs YSRCP వాళ్ళని జీరోలన్న హీరోలెందుకు భయపడాలి.?
2024 ఎన్నికల కోసం జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీ కలుస్తున్నాయి. అటు టీడీపీని జీరో అనేసి, జనసేన పార్టీనీ జీరో అనేసి.. ఇప్పుడు ఆ రెండు పార్టీల కలయికపై ఏడ్చి ఏడ్చి ఛస్తోంది వైసీపీ.!
అంతలా ఏడవాల్సిన పని వైసీపీకి ఏమొచ్చింది.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్ అయి కూర్చుంది వైసీపీ శ్రేణులకి.
కలిస్తే కలిశారు.. వైసీపీ మార్కు ఎలాగూ 175 కదా.! ‘వాళ్ళిద్దరూ కలిసినా మాకే లాభం’ అని చెప్పుకుంటున్న వైసీపీ, వాళ్ళిద్దరూ కలిస్తే ఎందుకు గింజుకుంటోందో ఏమో.!
చర్చల్లో ఏం తేలిందో..
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu), జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు.
మర్యాద పూర్వక భేటీ అనండీ, పొత్తుల చర్చలనండీ, సీట్ల పంపకాలపై సమాలోచనలనండీ.. ఏదైనా కావొచ్చు, పవన్ కళ్యాణ్ ఇంట్లో కీలక సమావేశం అయితే జరిగింది.
Also Read: ఎందుకొచ్చిన ఎగ్జిట్ పోల్.? ఎవర్ని ఏమార్చడానికి.?
గెలుపోటముల సంగతి తర్వాత, 2024 ఎన్నికలకు ముందు ఇలా తరచూ ఈ ఇద్దరూ కలుస్తోంటే, ముందు ముందు వైసీపీలో ‘మానసిక రోగులు’ ఎక్కువైపోతారో ఏమో.!