Glamorous Mudra Deviyani Sharma.. ఈ పాప చాలా హాట్ గురూ.! బోల్డ్ అండ్ వైల్డ్ కూడా. ఇంతకీ ఎవరీ బోల్డ్ పాప అనుకుంటున్నారా.?
‘సేవ్ ద టైగర్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన దేవియాని శర్మ.
ఈ వెబ్ సిరీస్ దేవియాని శర్మకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓ వైపు వుద్యోగం.. మరోవైపు ఇల్లు బాధ్యతలు అందులోనే అత్తగారి అగచాట్లు భరించే పాత్రలో చాలా డీసెంట్‌గా నటించింది దేవియాని శర్మ.

దేవియాని శర్మ నటించిన ‘సైతాన్’ వెబ్ సిరీస్ కూడా ఓటీటీ వీక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో ఆమె నటనకి విమర్శకుల ప్రశంసలూ దక్కాయి.
బ్యూటీ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్..
‘సైతాన్‘బోల్డ్ అండ్ వైల్డ్ క్యారెక్టర్‌లో దేవియాని శర్మ నటించింది. అలాగే, కత్తి పట్టి కస కసా నరికేసే సైతాన్ వంటి పాత్ర అది. డీ గ్లామర్ రోల్‌లో ఆమెను చూసిన ఆడియన్స్ నిజంగా షాక్ అయ్యారు.

కేవలం గ్లామరే కాదు, ఎలాంటి రోల్ అయినా దేవియాని శర్మ నుంచి ఆశించొచ్చు అని అప్పుడు ఫిక్స్ అయ్యారు.
పెద్ద తెర పైనా స్ర్టాంగ్ రోల్స్‌తో మెప్పించగల సత్తా వుంది దేవియాని శర్మకి. కానీ, కేవలం ఓటీటీ తెరకు మాత్రమే పరిమితమైపోతోంది.
ఛాలెంజింగ్ రోల్స్‌లో..
ఓటీటీలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటోంది. తనలోని నటికి ఛాలెంజింగ్‌గా వుండే పాత్రలవి. రియలిస్టిక్ పాత్రల్లో నటించడం అంటే తనకెంతో ఇష్టమని చెబుతోంది దేవియాని శర్మ.
Also Read: కన్యాకుమారి సమీక్ష.! సిక్కోలు ‘సిన్నది.. సిన్నోడు’ బావున్నారు.!
అలాగే యాక్షన్ రోల్స్ అయినా సత్తా చాటగలనని చెబుతోంది. మోడ్రన్ రోల్ అయినా, డీ గ్లామర్ రోల్ అయినా.. తాను సిద్ధమేనంటోంది.

అంతే కాదు, కామెడీ, సీరియస్ అండ్ ‘సైతాన్’ వంటి వైల్డ్ రోల్ ఏదైనా తనకు ఇష్టమేనని అంటోంది దేవియాని శర్మ.
చిన్నతనం నుంచీ నటనపై ఆసక్తితో పెరిగాననీ, అందుకే పాత్ర ఏదైనా సరే, అందులో టాలెంట్ చూపించడమే తన టార్గెట్ అని చెబుతోందీ ఢిల్లీ బ్యూటీ.
