Table of Contents
Chiranjeevi Balakrishna Kerosene Caste War.. కిరోసిన్ కిట్టు అలియాస్ బూతు కిట్టు అలియాస్ వేమూరి రాధాకృష్ణ.. మీడియా ముసుగులో కుల పంచాయితీని తెరపైకి తెచ్చాడు.!
అసలంటూ, మెగాస్టార్ చిరంజీవికీ నందమూరి బాలకృష్ణకీ పోలికేంటి.? ఇద్దరు ప్రముఖ నటులు.. అంతకు మించి, ఇద్దరి మధ్యా ఏనాడూ సినీ రంగంలో ఆధిపత్య పోరు లేదు.
ఎందుకంటే, చిరంజీవికి వున్న ట్రాక్ రికార్డ్.. నందమూరి బాలకృష్ణకి లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఏనాడూ, నందమూరి బాలకృష్ణ నెంబర్ వన్ హీరో అనిపించుకోలేదు.
Chiranjeevi Balakrishna Kerosene Caste War.. నట, రాజకీయ వారసత్వం..
తండ్రి నుంచి సినీ వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ అందుకుంటే, మెగాస్టార్ చిరంజీవి తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకున్నారు తెలుగు సినీ పరిశ్రమలో.
నిజానికి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని నిలబెట్టుకోవడమూ అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో బాలకృష్ణనీ తక్కువ చేయలేదు.

అయితే, తండ్రి పేరు చెప్పుకోకుండా నందమూరి బాలకృష్ణ తన ఉనికిని కాపాడుకోలేరు. పైగా, బాలకృష్ణకి ఓ వర్గం మీడియా అండదండలు ఎప్పుడూ వుంటాయి.
చిరంజీవికి అలా కాదు. చిరంజీవి అందరివాడు.. జనం దృష్టిలో. కానీ, మీడియా పరంగా చిరంజీవి ఎప్పుడూ అంటరానివాడే.. అన్నట్లు ఓ వర్గం మీడియా వ్యవహరిస్తుంటుంది.
చిరంజీవిపై ఏళ్ళ తరబడి దుష్ప్రచారం..
ఏళ్ళ తరబడి, ఆ వర్గం మీడియా, చిరంజీవి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తూనే వుంటుంది. కానీ, చిరంజీవి శిఖరం స్థాయికి ఎదిగారు.. స్వశక్తితో.
మధ్యలో అసలు కుల పంచాయితీ ఎక్కడి నుంచి వచ్చింది.? చిరంజీవికి వున్న కోట్లాది మంది అభిమానుల్లో అన్ని కులాలు, మతాలకు చెందిన అభిమానులున్నారు.
రాజకీయాల్ని తీసుకున్నా, చిరంజీవి తనంతట తానుగా ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. బాలకృష్ణ అలా కాదు, తండ్రి పేరు చెప్పుకునే రాజకీయాలు చేస్తున్నారు.
చాలా తేడాలున్నాయ్..
చాలా తేడాలున్నాయ్.. చిరంజీవికీ, బాలకృష్ణకీ. ఎవరి స్థాయి వాళ్ళది. కానీ, కుల పంచాయితీని తెరపైకి తెచ్చి, చిరంజీవి స్థాయిని తగ్గించాలన్నది బూతు కిట్టు ఆలోచన.
సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ముందుగా చిరంజీవి ఇంటి తలుపునే తడతారు. పరిశ్రమ పెద్దన్న బాధ్యతను చిరంజీవి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
చిరంజీవి నిర్వహిస్తున్న బ్లడ్ అండ్ ఐ బ్యాంక్.. కోవిడ్ కష్ట కాలంలో నెలకొల్పిన ఆక్సిజన్ బ్యాంక్.. చెప్పుకుంటూ పోతే, చిరంజీవి అంటేనే ఆపద్బాంధవుడు.
ఇవన్నీ కిరోసిన్ కిట్టు అలియాస్ బూతు కిట్టుకి తెలియవని ఎలా అనుకోగలం.? తెలిసీ, కుల జాడ్యంతో రగలిపోతున్నాడు ఏబీఎన్ ఆర్కే.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే.?
అసెంబ్లీలో, నందమూరి బాలకృష్ణ ‘సభా మర్యాద పాటించలేదు’ అన్నది బూతు కిట్టు ఉవాచ. బాలయ్యకి సందర్భ శుద్ధి లేదనీ కిరోసిన్ కిట్టు సెలవిచ్చాడు.
బాలకృష్ణ తప్పు చేశారు. ఆ తప్పుని ప్రస్తావించే క్రమంలో, చిరంజీవి స్థాయిని తగ్గించేందుకు ‘కుల పంచాయితీ’ని తెరపైకి తెచ్చిన, బూతు కిట్టు పాత్రికేయ వ్యభిచారం నభూతో నభవిష్యతి.!
