Pragya Jaiswal Silver Beauty.. అందం చూడవయా.. ఆనందించవయా.. అంటాడో కవి.! అందం, అమ్మాయి.. రెండూ పర్యాయ పదాలేనంటాడు ఇంకో కవి.!
ప్రకృతి, స్త్రీ.. అందం, అంతకు మించి.. అని అంటాడు మరో కవి.! అందుకే, తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి.. వీలైతే, పదింతలు చేసుకోవడానికి.. మహిళామణులు ప్రయత్నిస్తుంటారు.
సినిమా అంటేనే గ్లామర్.. మరి, ఆ గ్లామర్ ప్రపంచంలో అందాల భామలు ఇంకెంత అందంగా వుండేందుకు ప్రయత్నిస్తారు.? తప్పదు, ప్రయత్నిస్తూనే వుండాలి.

చూస్తున్నారుగా.. ఫొటోలో, ఈ బ్యూటీ ఎంతందంగా వుందో.! బికినీ లాంటి డ్రస్సు.. ఆపై లేసులతో అల్లినట్లున్న బాటమ్ పార్ట్.. సిల్వర్ బ్లూ కలర్‌లో ఈ ట్రెండీ కాస్ట్యూమ్ అదిరిపోయింది.!
Pragya Jaiswal Silver Beauty.. గ్లామరు.. గ్రామరు.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఆ డ్రెస్సుకే సరికొత్త గ్లామర్ తీసుకొచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ హైటూ, ఆ పర్సనాలిటీ.. ఫొటో సెషన్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళింది.
ఇక, ప్రగ్యా జైస్వాల్ సినిమా కెరీర్ విషయానికొస్తే, హిట్లున్నా.. ఎందుకో, రావాల్సిన స్థాయి స్టార్‌డమ్ అయితే ఈ బ్యూటీకి ఇంకా రాలేదు.!

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్, ‘జయ జానకి నాయక’ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసేసింది.!
అందం, అభినయం.. అన్నీ వున్నా, టైమ్ కలిసి రావడం లేదంతే.
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
సినిమాల సంగతి అటుంచితే, ఇదిగో ఇలాంటి స్టన్నింగ్ ఫొటో సెషన్లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ‘లైమ్ లైట్’లో వుండేందుకు ప్రయత్నిస్తోందీ పొడుగు కాళ్ళ బ్యూటీ.!
