Home » బూతు రాజకీయానికి శాలువా కప్పి, సన్మానించి, అవార్డులివ్వాలి.!

బూతు రాజకీయానికి శాలువా కప్పి, సన్మానించి, అవార్డులివ్వాలి.!

by hellomudra
0 comments
Ys Jagan YSRCP

YSRCP Dirty Politics Jagan.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు బెంగళూరు నుంచి. తప్పలేదు, రావాల్సి వచ్చింది.

2024 ఎన్నికల్లో ఓడిపోయాక, బెంగళూరులో వుంటున్న (తలదాచుకుంటున్న.. అని కూడా అనొచ్చు) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అడపా దడపా మాత్రమే తాడేపల్లికి వస్తున్నారు.

వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టడమో, లేదంటే అరెస్టయిన వైసీపీ నేతల్ని జైల్లో పరామర్శించడమో చేస్తున్నారు. ప్రత్యేకించి, జైలు యాత్రల విషయమై బోల్డంత ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

అసలు, వైఎస్ జగన్ ఎందుకు తాడేపల్లి నివాసంలో వుండటంలేదు.? బెంగళూరుకే ఎందుకు పరిమితమవుతున్నారు.? అన్నదానిపై వైసీపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

YSRCP Dirty Politics Jagan.. అసెంబ్లీ మొహం చూడని పులివెందుల ఎమ్మెల్యే..

పులివెందుల ఎమ్మెల్యే అయినప్పటికీ, అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరు కావడంలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతానన్నది వైఎస్ జగన్ వాదన.

ఇక, వైఎస్ జగన్ తాజాగా రాష్ట్రానికి రావడానికి బలమైన కారణం వుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టయి, జైల్లో వున్నారు.

ఈ క్రమంలో పరామర్శ యాత్ర కోసం వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనగా, పార్టీకి చెందిన కీలక నేతలు, భారీగా జన సమీకరణ చేశారన్నమాట.

ఓ మహిళ పసుపు రంగు చీర కట్టుకొస్తే, ఆమెని తూలనాడారు వైసీపీ నాయకులు. అంటే, ఎంతలా ఈ జన సమీకరణ కోసం వైసీపీ నేతలు శ్రమ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

వైఎస్ జగన్ నటనా ప్రతిభ..

ఇంకోపక్క, వైఎస్ జగన్ షరామామూలుగానే మీడియా మైకుల ముందు ఆగ్రహాన్ని నటించేశారు. స్క్రిప్ట్ ఎవరు రాశారోగానీ, అంబటి రాంబాబు బూతుల్ని వైఎస్ జగన్ సమర్థిస్తూ మాట్లాడేశారు.

‘అంబటి రాంబాబుని అభినందించాల్సింది పోయి..’ అంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అంబటి అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు.

టీడీపీ కార్యకర్తలకు బీపీలు పెరిగి (వైఎస్ జగన్ భాషలో), అంబటి ఇంటికి నిప్పు పెట్టేశారు. జోగి రమేష్ కూడా చంద్రబాబు, లోకేష్‌పైఅభ్యంతకర వ్యాఖ్యలు చేసిన దరిమిలా, అతనికీ అదే సన్మానం జరిగింది.

వాస్తవానికి, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు, విధ్వంసాలకు చోటు లేదు. కానీ, అభిమానస్తులకు కోపమొస్తే, దాడులు చేయొచ్చని గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వైఎస్ జగన్ స్వయంగా తీర్మానించారు.

టీడీపీ కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు..

సో, జగన్ మాటల్ని టీడీపీ కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నట్లుంది వ్యవహారం. ఈ పరిస్థితుల్లో జరిగిన తప్పుపై వైఎస్ జగన్, క్షమాపణ చెప్పి వుండాలి.

దాడులు ఎవరు చేసినా తప్పేనంటూ మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ వ్యాఖ్యానించి వుండాలి. కానీ, అంబటి రాంబాబు మంచోడంటూ సర్టిఫికెట్ ఇవ్వడమేంటి.?

Also Read: అసభ్యకరంగా తాకారు.. జుగుప్సాకరంగా తడిమేశారు.!

వస్తాడు.. ట్రోలింగ్ కంటెంట్ ఇచ్చి వెళ్తాడు.. అని ఓ కామెంట్ సోషల్ మీడియాలో జగన్ గురించి ట్రెండింగ్ అవుతుంటుంది. అదిప్పుడు ఇంకోసారి ట్రెండింగ్ అవుతోంది.

శాలువాలు కప్పాల్సింది పోయి.. సన్మానించడం పోయి.. అవార్డులు ఇవ్వడం పోయి.. ఏందీ దాడులు.. అన్నట్లుంది వ్యవహారం.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group