Home » బంగారం భవిష్యత్తేంటి.? లక్షకు పడేనా? రెండు లక్షలకు ఎగబాకేనా.?

బంగారం భవిష్యత్తేంటి.? లక్షకు పడేనా? రెండు లక్షలకు ఎగబాకేనా.?

by hellomudra
0 comments
Gold Silver

Gold Price Fluctuations.. కొన్నేళ్ళ క్రితం పది వేల రూపాయలకు లోపే పది గ్రాముల బంగారం లభించేది. ఇప్పుడు ఒక్క గ్రాము బంగారం కూడా పది వేల రూపాయలకు దొరకడం లేదు.

మొన్నామధ్య బంగారం ధరలు అనూహ్యంగా పెరిగి, దాదాపుగా 2 లక్షల రూపాయలను టచ్ చేసే స్థాయికి వెళ్ళింది. లక్షా తొంభై వేలకు దగ్గరగా వెళ్ళి, వెనక్కి వచ్చేసింది.

ప్రస్తుతం.. అనగా, 23 మార్చి 2026 నాడు.. అనూహ్యంగా బంగారం ధరలు నేల చూపు చూశాయి. లక్షా ముప్ఫయ్ ఐదు వేలకు అటూ ఇటూగా మారింది బంగారం ధర.

కాస్త కోలుకుని, లక్షా నలభై ఐదు వేల వద్ద స్థిరపడింది. ఏమో, బంగారం రేటు మళ్ళీ పెరుగుతుందేమో.! లేదు లేదు, అనూహ్యంగా పడిపోతుందేమో.. ఇదీ మార్కెట్ వర్గాల్లో చర్చ.

Gold Price Fluctuations.. బంగారం అలా.. క్రూడాయిల్‌కి యుద్ధం సెగలు ఇలా..

పెరుగుతుందా.? తగ్గుతుందా.? అన్నదానిపై అస్సలు స్పష్టత లేదు. ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగాయి.

దాంతో, బంగారం వైపు పెట్టుబడుల చూపులు అస్సలు కనిపించడంలేదు.

ఒకవేళ యద్ధవాతావరణం చల్లబడి, క్రూడాయిల్ ధరలు దిగొస్తే, బంగారం ధరలు కాస్త అదుపులోకి రావొచ్చు.

డాలర్‌తో పోల్చి చూసినప్పుడు రూపాయి ధర పతనమవుతున్నా, బంగారం ధరలు స్థిరంగా తగ్గుతుండం ఒకింత ఆశ్చర్యకరమేనని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆ మధ్య బంగారం ధరలు తిరిగి లక్ష రూపాయలకు (10 గ్రాములు) చేరుకుంటుందనే విశ్లేషణలు చూశాం. ఆ స్థాయికి బంగారం ధర పతనమవుతుందా.?

Also Read: చక్కనమ్మ చెవులకెందుకింత ‘బరువు’ బాధ్యతలు.?

లేదంటే, మళ్ళీ పెరిగి, పది గ్రాముల బంగారం సమీప భవిష్యత్తులో రెండు లక్షల రూపాయల మార్క్ అందుకుంటుందా.?

ప్చ్.. ఏదీ చెప్పలేం ప్రస్తుతానికి. అంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. బంగారం బాటలోనే వెండి కూడా అయోమయాన్నే సృష్టిస్తోంది.

నాలుగు లక్షలు.. ఆపైకి వెళ్ళిన కిలో వెండి, అనూహ్యంగా తగ్గింది. తగ్గడమంటే అలా ఇలా కాదు, దాదాపు సగానికి పడిపోయింది ధర.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group