Home » PSPK OG2 – గేమ్ ప్లాన్ మార్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.!

PSPK OG2 – గేమ్ ప్లాన్ మార్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.!

by hellomudra
0 comments
Pawan Kalyan OG

Pawan Kalyan Next OG2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే, సినిమాలకు సంబంధించిన వ్యవహారం.! అదే, జన సేనాని పవన్ కళ్యాణ్ అంటే, అది రాజకీయాలకు సంబంధించిన విషయం.!

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఇంతకీ, పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఏంటి.? సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా త్వరలో పట్టాలెక్కుతుందా.?

అభిమానులేమో, ‘ఓజీ’ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేయాలని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.!

Pawan Kalyan Next OG2.. ‘ఓజీ2’ సంగతేంటి.?

‘ఓజీ2’ విషయమై, సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది కూడా.! త్వరలో ఈ సినిమానే ప్రారంభమవుతుందన్న ప్రచారం జోరందుకుంది.

ఇంతలోనే, ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ టీమ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రకటన వచ్చింది. పవన్ కళ్యాణ్ చేయబోయే తదుపరి సినిమా గురించి స్వయంగా ఆయనే వెల్లడిస్తారన్నది ఆ ప్రకటన సారాంశం.

ఎందుకీ ప్రకటన, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి వచ్చినట్లు.? అంటే, దీనికి బలమైన కారణం లేకపోలేదు.

ఆ దర్శకుడు కథ చెప్పాడు.. ఈ దర్శకుడితో సినిమా..

తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇటీవల పవన్ కళ్యాణ్‌కి ఓ కథ చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. మరోపక్క, దేవ్ కట్టా దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా.. అంటూ, ఇంకో గాసిప్ వినిపిస్తోంది.

వెరసి, పవన్ కళ్యాణ్ తదుపరి చేయబోయే సినిమాపై, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న విషయం తేటతెల్లమైపోయింది.

ఎవరో ఎక్కడో గాలి పోగెయ్యడం, దాన్ని ఓ వర్గం మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం.. ఇదంతా ఓ ప్రసహనంగా తయారైంది, పవన్ కళ్యాణ్ మీద గాసిప్పులకు సంబంధించి.

Also Read: తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ అదే తప్పు.!

ఈ నేపథ్యంలోనే, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి పైన పేర్కొన్న ప్రకటన వచ్చింది. జన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి చాలా బాధ్యతున్నాయి. అవి చూసుకుంటూనే, సినిమాలు చేయాలి పవన్ కళ్యాణ్.

సో, పవన్ కళ్యాణ్ నుంచి కొత్తగా ఏదన్నా ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వాలంటే, దానికి తెరవెనుకాల బోల్డంత గ్రౌండ్ వర్క్ తప్పనిసరి.

‘నాలుగైదు గంటల సమయం మాత్రమే కేటాయించగలను రోజులో. ఎక్కువ రోజులు ఏకధాటిగా డేట్స్ ఇచ్చేయలేను..’ అంటూ, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు కూడా.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, పవన్ కళ్యాన్ తదుపరి ప్రాజెక్ట్.. అనేది వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్ అన్నమాట.!

మామూలుగా ఎలాంటి గాసిప్స్‌కీ స్పందించని పవన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ని రంగంలోకి దించి, వివరణ ఇస్తున్నారంటే, ఆయన గేమ్ ప్లాన్ మార్చినట్లే మరి.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group