Home » వైసీపీ క్యాడర్‌ని మోసం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.!

వైసీపీ క్యాడర్‌ని మోసం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.!

by hellomudra
0 comments
Y.S.Jagan Mohan Reddy

Ys Jagan Mavigun Capital.. ఒక ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే, ఇంకో ప్రభుత్వం ఇంకో తీర్మానం చేస్తుంది కదా.?

అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ అమరావతి విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.

ఈ తీర్మానం నేపథ్యంలోనే, పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పునర్ విభజన చట్టానికి సవరణ చేస్తూ, రాజధానిగా అమరావతి పేరుని ప్రస్తావించింది. ఆ బిల్లు పాస్ అయ్యింది కూడా.

‘ఇక, అమరావతిని మార్చడం ఎవరి వల్లా కాదు..’ అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ, ‘ఎందుకు మార్చలేం.? ప్రభుత్వం మారితే, ఇంకో తీర్మానం చేయొచ్చు కదా..’ అని వైఎస్ జగన్ సెలవిచ్చారు.

Ys Jagan Mavigun Capital.. క్యాడర్‌ని మోసం చేయడమే..

ఇది వైసీపీ క్యాడర్‌ని మోసం చేయడం తప్ప, వైఎస్ జగన్ వాదనలో పస లేదు. ఎందుకంటే, వైసీపీ హయాంలో మూడు రాజధానుల దిశగా తీర్మానం జరిగింది. కానీ, ఆ తీర్మానానికి విలువ లేకుండా పోయింది.

అధికారం చేతిలో వుంది కదా.. అని చట్ట సభల్లో, చెత్త తీర్మానాలు చేస్తే. చీవాట్లు తప్పవు. ఆ విషయం, మూడు రాజధానుల పేరుతో చెత్త తీర్మానం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే బాగా తెలుసు.

పైగా, అమరావతికి పార్లమెంటులో ఇప్పుడు చట్టబద్ధత లభించింది. ఒకవేళ ప్రభుత్వం మారి, అమరావతికి వ్యతిరేకంగా తీర్మానం చేసినా, దానికి మళ్ళీ పార్లమెంటులో ఆమోదం లభించాలి.

వైనాట్ 175 అంటూ, 2024 ఎన్నికలకు ముందు కూడా వైసీపీ క్యాడర్‌ని మభ్యపెట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కట్ చేస్తే, వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయ్.

సెల్ఫ్ డిస్ట్రక్షన్..

అయినాగానీ, క్యాడర్ ఇంకా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కాస్తో కూస్తో నమ్మకాన్ని కలిగి వుంది. దాన్నిప్పుడు. ఈ ‘మావిగన్’ స్టేట్మెంట్‌తో పూర్తిగా చెడగొట్టుకున్నారు వైఎస్ జగన్.

ఇన్నాళ్ళూ వైసీపీ పెంచి పోషించిన నీలి‘కుల’ మీడియా కూడా, వైఎస్ జగన్ ‘మావిగన్’ ప్రకటనను తప్పు పడుతుండడం గమనార్హం.

Also Read: రోజా రాజకీయమ్.! బూతులు.. తిట్టడమ్, తిట్టించుకోవడమ్.!

‘మావిగన్’ అనే ప్రకటన చేసేసి జారుకున్నారు వైఎస్ జగన్. దాన్ని మోసేంత శక్తి వైసీపీ క్యాడర్‌లో లేదిప్పుడు.!

వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే, ‘గుండె పోటు’ అంటూ సొంత మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేసినప్పుడూ క్యాడర్ మోసపోయింది.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని జగన్ అంటే, క్యాడర్ నమ్మింది. న్యాయ రాజధాని కర్నూలుపైనా వైసీపీ క్యాడర్ ఆశలు పెట్టుకుంది. వాళ్ళంతా ఇప్పుడు ‘మావిగన్’ దెబ్బకి షాక్ తినేశారు.

వైసీపీ జెండా పెట్టుకోవాలంటేనే, క్యాడర్ భయపడే పరిస్థితి తీసుకొచ్చారు వైఎస్ జగన్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group