Home » కవిత కొత్త పార్టీ.! సీరియస్సేనా.? కామెడీ కాదు కదా.!?

కవిత కొత్త పార్టీ.! సీరియస్సేనా.? కామెడీ కాదు కదా.!?

by hellomudra
0 comments
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha Serious Comedy.. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం.. అని అంటున్నారు, కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న కవిత.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత అనీ, తెలంగాణ జాగృతి అనే సంస్థ ద్వారా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!

కుటుంబ తగాదాలతో గులాబీ పార్టీ నుంచి కవిత బయటకు వచ్చారు. ఇది ఓపెన్ సీక్రెట్. తెలంగాణ రాష్ట్ర సమితిలో సోదరుడు కల్వకుంట్ల తారక రామారావుతో పొసగలేదు కవితకి.

అంతేనా, కేసీయార్ మేనల్లుడు హరీష్ రావుతోనూ కవితకి ఆధిపత్య పోరు వుండేది. హరీష్ రావు మీద అక్కసుతోనే గులాబీ పార్టీని వీడారు కవిత.

భారత్ రాష్ట్ర సమితిగా మారిన ఇకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి.. అప్పటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో లేదిప్పుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

Kalvakuntla Kavitha Serious Comedy.. పొలిటికల్ వాక్యూమ్ వుందా.?

ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ వాక్యూమ్ వుందని భావిస్తున్న కవిత, తమదే నిఖార్సయిన తెలంగాణ పార్టీ.. అని చెప్పబోతున్నారు. ఆల్రెడీ సంకేతాలు ఇచ్చారు కూడా.

ఇక్కడిదాకా బాగానే వుందిగానీ.. కొత్త రాజకీయ పార్టీని స్థాపించాక, తండ్రి కేసీయార్ కోరికతో తిరిగి భారత రాష్ట్ర సమితిలో తన పార్టీని కవిత విలీనం చేసెయ్యరు కదా.?

మంచి వాగ్ధాటి కవిత సొంతం.! అదే సమయంలో, దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత జైలుకు వెళ్ళి వచ్చారు. జైలుకు వెళ్ళి వస్తే, ముఖ్యమంత్రి పదవి వరిస్తుందన్న సెంటిమెంట్ ఒకటుందాయె.!

తండ్రే తొలి ప్రత్యర్థి..

ఏమో, గుర్రం ఎగరావచ్చు.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ‘సీరియస్ పొలిటీషియన్’ అనే కామెడీ ట్యాగ్, కల్వకుంట్ల కవిత మీద వుంది.

అందుక్కారణం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద గతంలో కవిత వేసిన సెటైర్లే.! ఆ సెటైర్ల తర్వాతే, గులాబీ పార్టీ నుంచి ఆమె బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది.

Also Read: ఇది ఆమె కథ.! కాదు, వ్యధ.!

అన్నట్టు, రాజకీయాల్లో తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే, కల్వకుంట్ల కవితకు తొలి ప్రత్యర్థి కాబోతున్నారు. గులాబీ పార్టీ మీద ఇప్పటికే కవిత చాలా ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీల మీద కాస్త తక్కువస్థాయిలోనే రాజకీయ ఆరోపణలు చేస్తున్న కవిత, గులాబీ పార్టీ మీద విమర్శల విషయంలో మాత్రం చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే.

చూద్దాం.. కవిత రాజకీయం సీరియస్సేనో.. లేదంటే, కామెడీ అయిపోతందో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group