TVK Vijay Government Tamilnadu.. తమిళ రాజకీయాల్లో సంచలనం.. పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే, అధికార పీఠమెక్కే దిశగా సంచలన విజయాన్ని అందుకున్నారు సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్.
కానీ, ఏం లాభం.? మ్యాజిక్ మార్కుకి కాస్త దూరంలో ఆగిపోయింది టీవీకే పార్టీ. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లున్నాయి.
అందులో, సగం అంటే, 117 సీట్లు. దానికి ఒక్క సీటన్నా ఎక్కువ సాధించాలి.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే. కానీ, 110 సీట్లకు లోపలే ఆగిపోయింది టీవీకే.
ఇప్పటిదాకా అధికారంలో వున్న డీఎంకే 60 సీట్ల దగ్గర ఆగిపోతే, ఏఐఏడీఎంకే పార్టీ 47 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాయి.
TVK Vijay Government Tamilnadu.. ఎవరి సాయం కోరతారో మరి.?
ఈ పరిస్థితుల్లో ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా, పలు రాజకీయ పార్టీల నుంచి విజయ్ సాయం కోరాల్సి వుంటుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.
విజయ్ తండ్రి ఆల్రెడీ సాయం కోరారుగానీ, కేవలం కాంగ్రెస్ పాయం వల్ల టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వుండదు. మరికొన్ని పార్టీల నుంచీ సాయం కావాలి.
ఇవేవీ కాదు, ఏఐఏడీఎంకే పార్టీ నుంచి విజయ్ సాయం కోరితే, ఆ పార్టీ అందుకు సమ్మతిస్తే మాత్రం, విజయ్ ముఖ్యమంత్రి అవడానికి ఎలాంటి ఇబ్బందులూ వుండవు.
Also Read: ఇది ఆమె కథ.! కాదు, వ్యధ.!
డీఎంకే సాయాన్ని మాత్రం విజయ్ కోరే ప్రసక్తే వుండకపోవచ్చు.. కానీ, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! ఎవరి సాయం తీసుకున్నా విజయ్‌కి భవిష్యత్ రాజకీయం అంత తేలిక కాదు.
ఓ రాజకీయ పార్టీకి పూర్తి మెజార్టీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో చాలా సందర్భాల్లో అలాంటి ప్రభుత్వాలు కుప్ప కూలాయి కూడా.
సంచలన విజయాన్ని ఎదుర్కొని కూడా విజయ్ ఇప్పుడు రాజకీయంగా సంకట స్థితిలోకి జారుకుంటున్నారన్నమాట.
