Home » ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తున్న ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్.!

ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తున్న ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్.!

by hellomudra
0 comments
Artificial Intelligence

Artificial Intelligence Unemployment.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కృతిమ మేథ.. పేరేదైతేనేం, సామాన్యుడిని రోడ్డున పడేస్తోంది. సామాన్యుడంటే, సాధారణ ఉద్యోగి.!

సాధారణ ఉద్యోగి అంటే, మళ్ళీ చాలా లెక్కలున్నాయ్. సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాదు, అన్ని రంగాలపైనా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తీవ్ర ప్రభావం చూపుతోంది.

కొత్తగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ పుట్టుకొచ్చేశాయి. ఇవి మనుషులు కాదు, కృత్రిమ మేథ సాయంతో పనిచేస్తాయివి. భౌతికంగా కూడా పని చేసే ‘రోబోట్’ లాంటి ఏజెంట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

ఆసుపత్రుల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ముందు ముందు పూర్తిస్థాయిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకంతో కనిపించబోతున్నాయి.

Artificial Intelligence Unemployment.. కొత్త ప్రపంచానికి మనుషులతో పనేముంది.?

ఇంతకీ, అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో నిండిపోతే, మనుషులతో పనేముంటుంది.? అసలు ఉద్యోగాలు వుంటాయా.? ఈ ప్రశ్న సహజంగానే అందరిలోనూ ఒకింత ఆందోళనకు కారణమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. కోడింగ్ వంటి కీలక విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పెద్దయెత్తున ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తోంది.

ఏఐ టూల్స్ వినియోగం పెరుగుతుండడంతో, నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోతోంది ప్రపంచ వ్యాప్తంగా. ‘అబ్బే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ వల్ల నష్టమేమీ లేదని చెప్పినవాళ్ళే ఉద్యోగాలు కోల్పోతున్నారిప్పుడు.

మరి, నిరుద్యోగం పెరిగిపోతే, ఆ భారం ప్రభుత్వాల మీదనే పడుతుంది కదా.? అంటే, అది నిజమేగానీ.. ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగడంలేదు.

అదీ ‘ఏఐ’నే అడిగి తెలుసుకోవాలేమో..

ఎందుకంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెద్ద పనినైనా సులభంగా మార్చేస్తోంది కాబట్టి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వాల్సిందిగా ఉద్యోగస్తులకు ఆయా కంపెనీలు సూచిస్తున్నాయి.

వాళ్ళలా అప్‌గ్రేడ్ అయ్యేలోపే, ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కంపెనీలూ, లైట్ తీసుకుంటున్నాయి. అనునిత్యం, ‘ఉద్యోగాల కోత’ అనే వార్తల్నే చూస్తున్నాం ఇందుకే మరి.!

ఈ వార్తలే ఇంత గుబులు పుట్టిస్తున్నాయంటే, భవిష్యత్ ముఖచిత్రం ఎలా వుండబోతోంది.? అన్న భయాందోళనలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఏం ఫర్లేదు, అప్డేట్ అయితే సరిపోతుంది.. అనేది చిన్నమాట.

కేవలం అప్డేట్ కాదు, అంతకు మించి.. ఏదో చెయ్యాలి. అదేంటో మళ్ళీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌నే మనం అడగాలేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group