Home » ఉత్కంఠ వీడింది.! కానీ, ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నాళ్ళు.!?

ఉత్కంఠ వీడింది.! కానీ, ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నాళ్ళు.!?

by hellomudra
0 comments
Vijay TVK

Tamilnadu CM Vijay Joseph.. చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ అనే నేను.. అంటూ ముఖ్యమంత్రి పీఠమెక్కనున్నారు విజయ్.

ప్రముఖ సినీ నటుడు తమిళ వెట్రిగ కజగం పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ మొత్తం 108 స్థానాల్లో గెలిచి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, మ్యాజిక్ మార్క్ 118 కాగా, పది సీట్లు తక్కవగా వచ్చాయి టీవీకే పార్టీకి.

దాంతో, ఎవరితో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడన్న ఉత్కంఠ నెలకొంది. తొలుత కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. ఆ తర్వాత వామపక్షాలు, పీఎంకే పార్టీలూ విజయ్‌కి మద్దతిచ్చాయి.

Tamilnadu CM Vijay Joseph.. ఉత్కంఠ వీడింది.. అసలు కథ మొదలైంది..

దాదాపు మూడు రోజుల ఉత్కంఠ తర్వాత, విజయ్‌కి గవర్నర్ నుంచి తీపి కబురు అందింది.. గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో, విజయ్ ముఖ్యమంత్రి అవడానికి అడ్డంకులు తొలగిపోయాయి.

వామపక్షాలు బయటనుంచి మద్దతిస్తాయనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మాత్రం, ప్రభుత్వంలో భాగస్వామి అవబోతోంది. పీఎంకే పార్టీ కూడా మంత్రి పదవుల్ని ఆశించనుంది.

ఇక, విజయ్ రెండు చోట్ల గెలుపొందగా ఓ చోట ఆయన రాజీనామా చేయాల్సి వుంది. దాంతో, ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ స్థానాన్ని కూడా పీఎంకే కోరుతోందిట.

ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత, అసెంబ్లీలో బల ప్రదర్శనను ఎదుర్కోవాల్సి వుంది టీవీకే విజయ్. బొటాబొటి మెజార్టీ గనుక, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

దిన దిన గండమే..

ఒక్కమాటలో చెప్పాలంటే టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు.. అన్న చందాన రోజులు కష్టంగా గడుస్తాయన్నమాట.

తమిళనాట తలపండిన రాజకీయ పార్టీలైన ఏఐఏడీఎంకే, డీఎంకేలను మట్టికరిపించి, టీవీకే విజయ్ సంచలన విజయాన్ని అందుకున్నారు.

ఏదిఏమైనా, ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. ప్రముఖ సినీ నటుడు విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి అవుతున్నారు.

తమిళనాట రాజకీయాల్లో సినీ ప్రముఖులు రాణించడం ఇదే కొత్త కాదు. ప్రముఖ నటి, దివంగత జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పలుమార్లు సేవలందించారు.

ప్రముఖ నటుడు, దివంగత ఎంజీఆర్ కూడా తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు విజయ్ వంతు.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group