Ethanol Blended Petrol India.. అదేంటీ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలే కల్తీ పెట్రోల్ విక్రయిస్తే, వాహనదారులు తమ గోడు ఎవరితో చెప్పుకోవాలి.?
దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. చర్చ కాదు, రచ్చ.! ఔను, పెద్దయెత్తున రచ్చే జరుగుతోంది. మీకు తెలుసా, మీ వాహనాల్లో మీరు వాడుతున్నది 100 శాతం పెట్రోల్ కాదని.?
పెట్రోల్‌లో, 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. దీన్ని, మనం సాధారణ పెట్రోల్.. అని నమ్మేస్తున్నాం. దేశవ్యాప్తంగా, ఎక్కడ ఏ పెట్రోల్ బంకుల్లో అయినా, ఇదే లభిస్తోంది.
పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 20 నుంచి ఏకంగా 85 శాతానికి పెంచేస్తున్నారు కూడా. ఆపై, పూర్తిగా 100 శాతం ఇథనాల్‌తో వాహనాలు మనం నడపాల్సి వస్తుంది.
ఈ మధ్యనే, మారుతి సుజికీ సంస్థ ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనం అంటూ సరికొత్త వ్యాగనార్‌ని మార్కెట్‌లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇదైతే, 85 శాతం ఇథనాల్ మిక్స్ అయిన పెట్రోల్‌తో నడిచే వాహనం.
Ethanol Blended Petrol.. పాత వాహనాల ఖేల్ ఖతమ్..
మరి, పాత వాహనాల సంగతేంటి.? పాత వాహనాల ఇంజిన్లు, ఈ20 పెట్రోల్ కారణంగా నాశనమైపోతున్నాయ్. మాటి మాటికీ సర్వీసింగ్ సెంటర్లకు తీసుకెళ్ళాల్సి వస్తోంది.
ఈ కారణంగా, పాత వాహనాలు వాహనదారులకు ఆర్థిక భారంగా మారుతున్నాయి. ప్రతి నెలా దాదాపుగా జేబు గుల్ల అవుతోంది ఈ ఇథనాల్ మిక్స్‌డ్ పెట్రోల్ కారణంగా.
పెట్రోల్ కోసం, చమురు కంపెనీలు అలానే ప్రభుత్వం నిర్ణయించిన ధరల్నే కదా వాహనదారులు చెల్లిస్తున్నది.? అందులో, వాహనదారులకు డిస్కౌంట్లు ఏమీ లభించట్లేదు కదా.?
అలాంటప్పుడు, నాణ్యమైన పెట్రోల్‌ని పొందే హక్కు వాహనదారులకు వుంటుంది కదా.? అంటే, అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ‘తప్పడంలేదు’ అని అంటోంది ప్రభుత్వం.
నిజమే, పెట్రో ఉత్పత్తుల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వున్నందున, ఇథనాల్ మిక్స్ చేసిన పెట్రోల్ అయితే, దేశానికీ ఆర్థిక భారం తప్పుదున్న కేంద్ర ప్రభుత్వ వాదనను తప్పు పట్టలేం.
కానీ, వాహనదారులను చిదిమేస్తున్న ఈ పరిస్థితిపై కేంద్రం సమాధానం చెప్పకపోతే ఎలా.? పాత వాహనాల్లో మార్పులకు అవకాశాలు కల్పించాలి.. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా.
