Narendra Modi Failed PM.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మొట్ట మొదటిసారి ఎదురు దెబ్బ తగిలిందా.? కేంద్ర మంత్రితో రాజీనామా చేయించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది.?
నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడం అత్యంత దురదృష్టకం. కానీ, దీనికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎలా బాధ్యత వహిస్తారు.? ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కదా, ఈ పరీక్షను నిర్వహించింది.?
ఈ మాత్రం ఇంగితం వుంటే, అవి బొద్దింకలు ఎందుకవుతాయి.? కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో ఓ మూక, దేశ ప్రధానిపై ఒత్తిడి తీసుకొచ్చింది. కేంద్ర మంత్రితో రాజీనామా చేయించగలిగింది.
వాస్తవానికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ పేపర్ లీక్ వ్యవహారం, తదనంతర పరిణామాల్ని లైట్ తీసుకున్నారు. అదే, ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అతి పెద్ద తప్పిదం.
అయితే, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎన్టీయే వేగంగానే స్పందించింది. తక్కువ సమయంలోనే మళ్ళీ పరీక్షను నిర్వహించింది. పరీక్ష ఫీజుని కూడా రద్దు చేసింది.
Narendra Modi Failed PM.. తప్పెక్కడ జరిగింది.? శిక్ష ఎవరికి పడింది.?
రెండోసారి నీట్ పరీక్షని అత్యంత పారదర్శకంగా, అత్యంత సమర్థంగా నిర్వహించింది కూడా. అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంత బాగా పరీక్ష నిర్వహించినా, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని బలంగా చెప్పుకోలేకపోయింది.
అదే, విపక్షాలకు అడ్వాంటేజ్ అయి కూర్చుంది. సన్నితమైన అంశం కావడంతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కాస్త సంయమనం పాటించి వుండొచ్చు.
కేంద్ర విద్యా శాఖ మంత్రిగా పని చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కూడా, ఈ మొత్తం వ్యవహారంపై వ్యూహాత్మక మౌనం పాటించి వుండొచ్చు. అదే, చేతకానితనంగా మారిపోయింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో, నీట్ పరీక్ష వివాదం రాజకీయంగా ఓ కొలిక్కి వచ్చిందని అనుకోవాలంతే. అంతకు మించి, నీట్ అభ్యర్థులకు అదనంగా ఒరిగేదేమీ వుండదు.
కాక్రోచ్ జనతా పార్టీ మూకకి, వివిధ రాజకీయ పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. విదేశీ శక్తుల అండ కూడా ఈ బొద్దింకలకి బాగా లభించడం గమనార్హం.
మోడీ సర్కారు వైఫల్యమే..
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన బొద్దింకల ధర్నా, విధ్వంసాలకు తెరలేపింది. ఇదంతా మోడీ సర్కారు వైఫల్యమే. ఆందోళనల తీవ్రతను సకాలంలో అర్థం చేసుకోలేకపోయింది మోడీ సర్కార్.
డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఇప్పుడసలు ఆస్కారమే లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన తయారయ్యింది పరిస్థితి.
పన్నెండేళ్ళుగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇవే బొద్దింకలు ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామాకు డిమాండ్ చేసి వుంటేనో.?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాల్సి వచ్చేదేమో. అదే జరిగితే, దేశ రాజకీయాల్లో ఇదో సరికొత్త సంచలనం అయి వుండేది.
రానున్న మూడేళ్ళు ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు. దినదినగండం.. నూరేళ్ళ ఆయుష్షు.. అన్నట్లు తయారయ్యిందిప్పుడు.. ప్రధాని పదవి.
