Home » అబ్బాయ్ కోసం బాబాయ్ ఎందుకు రాలేదు.? వచ్చేశాడుగా.!

అబ్బాయ్ కోసం బాబాయ్ ఎందుకు రాలేదు.? వచ్చేశాడుగా.!

by hellomudra
0 comments
Jayakrishna Ghattamaneni Srinivasa Mangapuram

Jayakrishna Ghattamaneni Maheshbabu.. జయకృష్ణ ఘట్టమనేని.. సూపర్ స్టార్ కృష్ణ మనవడు. అదేనండీ, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు తెలుసు కదా.. ఆ రమేష్‌బాబు తనయుడే జయకృష్ణ.!

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు జయకృష్ణ ఘట్టమనేని.

ఇంతకీ, బాాబాయ్ మహేష్‌బాబు ఎక్కడ.? ఇదే ప్రశ్న, సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ప్రశ్నాస్త్రాలు దూసుకొచ్చాయ్.

అంతలోనే, సూపర్ స్టార్ మహేష్‌బాబు నుంచి, ఓ వీడియో వచ్చింది. ‘మా రమేష్ అన్నయ్య కొడుకు జయకృష్ణ హీరోగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాలి’ అంటూ ఆ వీడియోలో మహేష్ వ్యాఖ్యానించాడు.

‘నేను, రామ్ చరణ్.. ఇలా చాలామంది వైజయంతీ బ్యానర్ నుంచే హీరోలుగా తెరంగేట్రం చేశాం.. మా బాటలోనే జయకృష్ణ కూడా..’ అంటూ మహేష్ తన అన్న కుమారుడు జయ కృష్ణ గురించి చెప్పడం గమనార్హం.

నిజానికి, మహేష్ ఎక్కడ.? అన్న ప్రశ్న, నేరుగా హీరో జయకృష్ణ ఘట్టమనేనికే ఎదురయ్యింది మీడియా నుంచి. కుర్రాడు కదా, సమాధానం చెప్పడానికి కాస్త ఆలోచించాడు.

ఇంతలోనే మైక్ అందుకున్న అజయ్ భూపతి, ‘సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్నీ మహేష్‌బాబు అడిగి తెలుసుకుంటున్నారు.. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు’ అని చెప్పాడు.

కానీ, కాస్త ఆలస్యమయ్యింది.! సినిమా ప్రమోషన్స్ కోసం ఏదో ఒక సందర్భంలో మహేష్‌బాబు ప్రత్యక్షంగా పాల్గొని వుండాల్సింది.

కొన్నాళ్ళ క్రితం రమేష్‌బాబు అనారోగ్యంతో అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితం రమేష్‌బాబు కూడా సినిమాల్లో నటించారు.

ఎక్కువ సినిమాలు చేయలేదు.. హీరోగా కొనసాగలేదు. ఇప్పుడు, ఆ రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ తెరంగేట్రం చేస్తున్న దరిమిలా, సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

అన్నట్టు, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా ప్రోమోస్ ఆకట్టుకుంటున్నాయి.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. లీడ్ పెయిర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుంది. ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తున్నారు.

ఏమో, సినిమా రిలీజయ్యాక బాబాయ్ మహేష్ వస్తాడేమో, అబ్బాయ్ జయకృష్ణని అభినందించేందుకోసం. వెయిట్ అండ్ సీ.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group