Home » నాగబాబుకి మంత్రి పదవి దక్కలేదు.! క్యాబినెట్ ర్యాంక్‌ మాత్రమే.!

నాగబాబుకి మంత్రి పదవి దక్కలేదు.! క్యాబినెట్ ర్యాంక్‌ మాత్రమే.!

by hellomudra
0 comments
MLC Nagababu Pawan Kalyan

MLC Nagababu Cabinet Rank.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి మంత్రి పదవి దక్కుతుందంటూ గతంలో ప్రచారం జరిగింది.

2024 ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి పోటీ చేయాల్సిన నాగబాబు, టీడీపీ – జన సేన – బీజేపీ పొత్తులో భాగంగా, తన సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలో కొణిదెల నాగబాబుని శాసన మండలికి పంపి, మంత్రిని చేస్తామని జన సేనాని పవన్ కళ్యాణ్‌కి హామీ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.

కూటమి సర్దుబాట్ల నేపథ్యంలో జరిగిన ఒప్పందమిది. అయితే, నాగబాబుని శాసన మండలికి అయితే పంపారుగానీ, మంత్రి పదవి ఇవ్వలేకపోయారు చంద్రబాబు.

తాజాగా, ‘మెగా బ్రదర్’ నాగబాబుకి క్యాబినెట్ ర్యాంక్ దక్కింది. మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివి కమిటీ ఛైర్మన్ పదవికి నాగబాబు పేరుని ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం.

‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్ పర్సన్‌గా నాగబాబుకి కీలక పదవి దక్కింది. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది.

MLC Nagababu Cabinet Rank.. మంత్రి పదవి దక్కి వుండాల్సింది..

అయితే, జన సేన శ్రేణులు మాత్రం నాగబాబుకి మంత్రి పదవి దక్కి వుంటే బావుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క, షరాామామూలుగానే ఇటు వైసీపీ నుంచి నాగబాబు మీద ట్రోలింగ్ జరుగుతోంది. టీడీపీ ముసుగేసుకున్న కొందరు వైసీపీ అభిమానులదీ అదే బాపతు.

2024 ఎన్నికల సమయంలో కూటమి గెలుపు కోసం నాగబాబు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సంగతి తెలిసిందే.

గతంలో టీడీపీ మీద రాజకీయంగా కొణిదెల నాగబాబు చేసిన విమర్శల్ని పదే పదే టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటాయి.

పవన్ కళ్యాణ్ సహా నాగబాబు, చిరంజీవి మీద టీడీపీలో ఓ వర్గం ఎప్పుడూ ఒకింత అసహనంతోనే వుంటాయన్నది నిర్వివాదాంశం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group