Home » సెల్ఫీ ప్రేమ.! అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందా.?

సెల్ఫీ ప్రేమ.! అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందా.?

by hellomudra
0 comments
Tridha Choudhury

Tridha Choudhury Selfie Love.. అసలు సెల్ఫీలంటే అమ్మాయిలకు అంత ప్రేమెందుకు.? అమ్మాయిలేనా.? అబ్బాయిలూ సెల్ఫీల మీద విపరీతమైన ఆసక్తి చూపిస్తుంటారు.

సెల్ఫీ లవ్.. ఈ విషయంలో అమ్మాయిలదే పై చేయి.! రకరకాల యాప్స్ సాయంతో సెల్ఫీలు దిగుతుంటారు. నేచురల్ లుక్‌తో కొందరు తమ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

అద్గదీ అసలు పాయింట్.! సోషల్ మీడియాలో తమను తాము కొత్తగా చూపించుకునేందుకు ఈ ‘సెల్ఫీ’ బాగా ఉపయోగపడుతోంది.

Tridha Choudhury
Tridha Choudhury

ఏ రెండు సెల్ఫీల ఎక్స్‌ప్రెషన్ ఒకేలా వుండదని చాలామంది అంటుంటారు. అంతే మరి, ఒక్కోసారి.. ఒక్కోలా.. చిన్న చిన్న తేడాలతో సెల్ఫీలు క్లిక్ అవుతుంటాయ్.

చూస్తున్నారు కదా.. సెల్ఫీ లవ్ ఎలా వుందో. ఆమె ఎవరో కాదు, చాలాకాలం క్రితం నిఖిల్ హీరోగా నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేసిందీ భామ.

పేరేమో త్రిధా చౌదరి. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ.. పలు వెబ్ సిరీస్‌లలోనూ నటించింది త్రిధా చౌదరి. త్రిధా చౌదరికి సెల్ఫీలంటే భలే ఇష్టం.!

Tridha Choudhury
Tridha Choudhury

రెగ్యులర్ ఫొటో షూట్స్‌తో పోల్చితే, సెల్ఫీలలో సహజత్వం ఎక్కువ వుంటుందని త్రిధా చౌదరి చెబుతుంటుంది. సెల్ఫీలను ఇష్టపడేవారెవరైనా చెప్పే మాటే ఇది.

నిజమే.. సెల్ఫీలు సహజత్వాన్ని చాటుతాయి. కానీ, ఆ సహజత్వానికి ముసుగేసి, సెల్ఫీలను స్మార్ట్‌గా ట్యాంపర్ చేసేస్తే.? అదే, కొన్ని యాప్స్ సాయంతో.. ఫైన్ ట్యూన్ చేస్తే.. అవీ బోల్డన్ని వున్నాయ్.

మరోపక్క, సెల్ఫీలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారు కొందరు. అందులో నిజమెంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

Tridha Choudhury
Tridha Choudhury

ముఖ కవళికల్ని అందంగా మార్చుకోవడానికి సెల్ఫీలు ఉపయోగపడతాయనేది ఇంకో వాదన. అద్దం ముందు నిల్చుని, ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడం.. అనేది పాత ట్రెండ్.

అద్దంతో పోల్చితే, సెల్ఫీ మరింత సహజంగా మనల్ని మనకి పరిచయం చేస్తుందనీ.. సెల్ఫీ వీడియోలతో, ముఖ కవళిలకల్లోని లోపాల్ని సరిచేసుకునే అవకాశం వుంటుందనీ నమ్మేవారూ లేకపోలేదు.

Tridha Choudhury
Tridha Choudhury

ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.! ఒక్కటి మాత్రం నిజం.. రెగ్యులర్ ఫొటో సెషన్లతో విసిగిపోయే సెలబ్రిటీలకు, సెల్ఫీలు.. సమ్‌థింగ్ వెరీ స్పెషల్ అంతే.

చివరగా.. సెల్ఫీలు అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచినా పెంచకపోయినా ఫర్లేదు.. ఆత్మన్యూనతాభావాన్ని పెంచకూడదు.! అది అత్యంత ప్రమాదకరం.

అంతే కాదు, పడక గదిలో సెల్ఫీలు.. తప్పుడు వ్యవహారాలకి ఆస్కారమిస్తాయి. జర జాగ్రత్త.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group