Home » నాలాంటోడు కూడా బొద్దింక అవుతాడు: వైఎస్ జగన్

నాలాంటోడు కూడా బొద్దింక అవుతాడు: వైఎస్ జగన్

by Mudra369 Editorial Desk
0 comments
YS Jagan Mohan Reddy Cockroach

Cockroach Jagan Mohan Reddy.. దేశవ్యాప్తంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో నడుస్తున్న హడావిడి గురించి తెలుసు కదా.! ఏకంగా కేంద్ర మంత్రినే పదవీచ్యుతడిని చేయగలిగింది ఈ కాక్రోచ్ బృందం.

మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అలాంటి బొద్దింకే అయితే.? ‘నాలాంటోడు కూడా బొద్దింక అవుతాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి తాడేపల్లి నివాసానికి వచ్చి, ప్రెస్ మీట్లు పెడుతుంటారు కదా.!

అలాంటి ప్రెస్ మీటే ఈ రోజు కూడా జరిగింది. వివిధ అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద వైఎస్ జగన్ రాజకీయ విమర్శలు చేయడంలో వింతమేంది.? రాజకీయ ప్రత్యర్థి కాబట్టి, రాజకీయ విమర్శలు తప్పవు.

Cockroach Jagan Mohan Reddy.. పదే పదే కాక్రోచ్ ప్రస్తావన తెస్తున్న జగన్..

ఆ సంగతి పక్కన పెడితే, అసలంటూ ‘కాక్రోచ్’ ప్రస్తావన ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ ఎందుకు చేస్తున్నారన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

కాక్రోచ్ జనతా పార్టీకి తెరవెనుకాల ఫండింగ్ కాంగ్రెస్ పార్టీనే చేస్తోందన్న విమర్శలున్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతిస్తోంది.

నిజానికి, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఓ రాజకీయ పార్టీ కాదు. ఓ సమూహం.! కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి వ్యతిరేకంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పని చేస్తోంది.

మరి, అలాంటి బొద్దింకల్లో తానూ ఒకడినని పదే పదే చెప్పుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తారా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయా..

రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ వ్యవహరించడం మామూలే. కాకపోతే, ఆ టీడీపీతో పొత్తులో వున్న బీజేపీ విషయమై జగన్ కొంత మెతక వైఖరి అవలంభిస్తుంటారు.

ఇక, కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైఎస్ జగన్. అది అందరికీ తెలిసిన విషయాలే.

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. కాక్రోచ్ ప్రస్తావన ద్వారా కాంగ్రెస్ పార్టీతో సఖ్యతను వైఎస్ జగన్ కోరుకుంటున్నారేమో.!

అంటే, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ చెట్టాపట్టాలేసుకు తిరగడం మనం చూడబోతున్నామన్నమాట.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group