Vaishnavi Chaitanya Marriage Rumors.. పెళ్ళయిపోతే, సినిమాల్లో నటించకూడదా.? రష్మిక మండన్న సినిమాల్లో నటిస్తోంది కదా.! సమంత కూడా పెళ్ళయ్యాక సినిమాలు చేసింది.. చేస్తోంది కూడా.!
వైష్ణవి చైతన్య మాత్రం, ‘పెళ్ళెప్పుడు.?’ అన్న ప్రశ్నకి, ‘నేనింకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా..’ అని సెలవిచ్చింది.!
ఓ హీరో, ఓ హీరోయిన్.. కలిసి వరుసగా సినిమాలు చేస్తోంటే, సహజంగానే ఆ హీరో హీరోయిన్ల చుట్టూ బోల్డన్ని గాసిప్స్ షురూ అవుతాయ్.. ‘ఎఫైర్’ అంటూ.!
‘బేబీ’, ‘ఎపిక్’ సినిమాల్లో కలిసి నటించిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండకి రష్మిక మండన్న ఎలానో, ఆనంద్ దేవర కొండకి వైష్ణవి చైతన్య అలా.. అంటూ కొన్నాళ్ళుగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయ్.
ఈ నేపథ్యంలో, పెళ్ళి పుకార్లపై స్పందించింది వైష్ణవి చైతన్య. పెళ్ళికింకా చాలా సమయం వుందని చెప్పింది. ‘త్వరలో పెళ్ళి.. అని ఆనంద్ చెప్పాడు కదా.. నాకైతే, ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదు’ అని స్పష్టం చేసింది వైష్ణవి.
‘ఏమో, సమీప భవిష్యత్తులో మీ ఇద్దరూ పెళ్ళిపీటలెక్కుతారేమో..’ అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే, ‘నో ఛాన్స్..’ అనేసింది వైష్ణవి చైతన్య.
‘బేబీ’ సినిమాకి కూడా విపరీతమైన నెగెటివిటీ వచ్చినా, ఆ సినిమా కమర్షియల్‌గా నిలబడింది. కానీ, ‘ఎపిక్’ సినిమా డిజాస్టర్ టాక్‌తో, బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిలపడింది.
సినిమాని మేగ్జిమమ్ ప్రమోట్ చేసింది ‘ఎపిక్’ టీమ్.! కానీ, వైష్ణవి – ఆనంద్ కాంబినేషన్‌లో డిజాస్టర్‌గా నిలిచపోయింది.
నిజానికి వైష్ణవిపై రూమర్స్, ఆమె సినిమాల్లోకి రాకముందు.. యూ ట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నప్పుడూ వచ్చాయ్. సినీ రంగంలో రూమర్స్ సర్వ సాధారణమేంతే.
అన్నట్టు, రష్మిక – విజయ్ మీద వచ్చినన్ని రూమర్స్ ఇంకే సినీ జంట మీదా వచ్చి వుండవు. ఆ రూమర్స్‌ని ఇటు రష్మిక, అటు విజయ్.. చాలా సందర్బాల్లో కొట్టి పారేశారు.
కానీ, ఇద్దరూ కొన్నాళ్ల క్రితమే వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. సో, వైష్ణవి – ఆనంద్ మధ్య రూమర్స్ కూడా ఏదో ఒక రోజు నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదు.
