Home » జగన్ ‘రెడ్డి’ హిందూ మతంలోకి మారాల్సిందేనా.?

జగన్ ‘రెడ్డి’ హిందూ మతంలోకి మారాల్సిందేనా.?

by Mudra369 Editorial Desk
0 comments
Vijaya Sai Reddy Ys Jagan

Jagan Christianity Hinduism.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరిగి హిందూ మతంలోకి మారాల్సిందేనా.? ‘నా మతం మానవత్వం’ అంటూ కథలు చెప్పడం మాని, క్రైస్తవాన్ని వీడాల్సిందేనా.?

మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ వైసీపీ నేత విజయ సాయి రెడ్డి తాజాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం క్రైస్తవంలో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హిందూ మతంలోకి మారాలనీ, మతం మారాకే ‘రెడ్డి’ అని చెప్పుకోవాలని అల్టిమేటం జారీ చేశారు విజయ సాయి రెడ్డి.

అందరికీ తెలిసిన విషయమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ క్రైస్తవాన్ని అనుసరిస్తారని. అయితే, అప్పట్లో వీరిద్దరి ‘మతం’ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం కాలేదు.

Jagan Christianity Hinduism.. జగన్ హయాంలో హిందూ దేవాలయాల విధ్వంసం..

కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మత మార్పిడులు విచ్చలవిడిగా జరగడం, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం.. వీటన్నిటి తర్వాత, ‘మతం కోణం’లో చర్చ ఎక్కువైంది.

‘మతం మారితేనే వైసీపీలో సీటు’ అనే నిబంధనల్ని కూడా వైఎస్ జగన్ అమలు చేశారని సాక్షాత్తూ విజయ సాయి రెడ్డి ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.

తాజాగా, ‘మతం మారాకనే రెడ్డి అని చెప్పుకోవాలనీ.. మతం మారకుండా అందర్నీ మోసం చేయడం తగదనీ’ విజయ సాయి రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

ఏ1 మీద ప్రేమతో ఏ2

తెలుసు కదా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విజయ సాయి రెడ్డి ఏ2 నిందితుడని. ఏ1 నిందితుడు వైఎస్ జగన్. వైఎస్ జగన్ గురించి, విజయ సాయి రెడ్డికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.

వైసీపీలో ఒకప్పుడు విజయ సాయి రెడ్డి ‘నెంబర్ టూ’ పొజిషన్‌లో వుండేవారు. ఇప్పటికీ వైఎస్ జగన్ మీద విజయ సాయి రెడ్డికి మమకారం తగ్గలేదు.

అందుకే, ఉచిత సలహా ఇస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా బలపడటానికి. హిందూ మతంలోకి వైఎస్ జగన్ వస్తే, రాజకీయంగా వైసీపీ బలపడుతుందన్నది విజయ సాయి రెడ్డి ఉవాచ.

మరోపక్క, వైఎస్ జగన్ మీద ఎంతలా ‘క్రైస్తవ ముద్ర’ విజయ సాయి రెడ్డి వేస్తే, అంతలా క్రైస్తవ ఓటు బ్యాంకు, వైసీపీని బలంగా అంటిపెట్టుకుని వుంటుందనీ విజయ సాయి రెడ్డి భావిస్తుండొచ్చు.

ఇంతకీ, విజయ సాయి రెడ్డి ఇచ్చిన ఉచిత సలహాని పాటించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవం లోంచి హిందూ మతంలోకి మారతారా.? వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group