Gayatri Devi Vijayadasami.. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తారు.
సర్వ వేద శాస్త్రాల సారాంశానికి ప్రతీక గాయత్రి దేవి. పంచ ముఖాలతో పది చేతులతో ఈ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
బుద్ధిని సన్మార్గంలో నడిపించేందుకు గాయత్రీ మాతను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా సద్భుద్ధి, వివేకం, జ్ఞానం మంచి వాక్బుద్ధి ప్రాప్తిస్తాయని నమ్ముతారు.
Gayatri Devi Vijayadasami.. పురాణ గాధ
పురాణాల్లో దేవీ భాగవతం ప్రకారం, గాయత్రీ దేవి సాక్షాత్తూ పరాశక్తి మూల స్వరూపంగా తెలపబడింది.
సృష్టి ఆరంభంలో ఓం కారం నుండి వ్యాహృతులు వాటి నుంచి గాయత్రీ మంత్రం, ఆ మంత్రం నుంచి నాలుగు వేదాలు ఆవిర్భవించాయి.
అందుకే గాయత్రీ దేవిని వేదమాతగా కొలుస్తారు. సూర్య భగవానుడి అంతర్గత శక్తిగా గాయత్రి దేవిని పూజిస్తారు.
భౌతికంగా సూర్యుడు లోకానికి వెలుగునిస్తే.. మానవుల అంతరంగానికి విజ్ఞాన, వికాసపు వెలుగును గాయత్రి మాత అందిస్తుంది.
గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు ఐదు ముఖాల (ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ)తో దర్శనమిస్తుంది. ఈ ఐదు ముఖాలు పంచ భూతాల (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం)లకు ప్రతీకలు.
నిష్టతో గాయత్రిని ఆరాధిస్తే..
అలాగే పంచ ప్రాణాలూ, పంచ కోశాలకూ ప్రతీక. మనిషిలోని కామ, క్రోధ, మధ, మాశ్చర్యాలను నియంత్రించి అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మ జ్ఞానాన్ని అందించే తల్లి గాయత్రి.
ఎవరైతే తనను నిష్టగా, భయ, భక్తులతో ఆరాధించి, నిత్యం గాయత్రి మంత్రాన్ని అవుపాశన చేస్తారో వారిని సమస్త ఆపదల నుంచి రక్షిస్తుంది.
నవరాత్రుల్లో గాయత్రి దేవిని భక్తితో ఆరాధించడం వల్ల సాధకులకి జ్ఞానం, వాక్బుద్ధి, ఆయురారోగ్యాలూ చేకూరుతాయని తెలిపే సందేశాన్ని ఈ అవతారం సూచిస్తుంది.
నారింజ లేదా పసుపు రంగు చీరలో గాయత్రి దేవిని అలంకరిస్తారు. అలాగే పులిహోర, కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.