Home » రష్మిక – విజయ్ ‘విడాకుల’పై వివరణతో పుకార్లు తగ్గలేదు, పెరిగాయ్.!

రష్మిక – విజయ్ ‘విడాకుల’పై వివరణతో పుకార్లు తగ్గలేదు, పెరిగాయ్.!

by Mudra369 Editorial Desk
0 comments
Rashmika Mandanna Vijay Deverakonda

Rashmika Vijay Divorce Rumors.. మొన్నీమధ్యనే కదా విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న వైవాహిక బంధంతో ఒక్కటైంది.? ఇంతలోనే, ఈ విడాకుల పుకార్లేంటి.?

రష్మిక మండన్న, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమాయణం ఈనాటిది కాదు.! ఎప్పటినుంచో నడుస్తున్నదే. సుదీర్ఘ కాలం ప్రేమాయణం తర్వాత, వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు రష్మిక, విజయ్.

సినీ రంగంలో ఇలాంటివి కొత్తేమీ కాదు.! చాలామంది విషయంలో ఇలానే జరిగింది. పుకార్లు రావడం, వాటిని ఖండించడం.. ఇదంతా ఓ నిరంతర ప్రక్రియ.

సమంత – నాగచైతన్య చుట్టూ బోల్డన్ని పుకార్లు వచ్చాయ్.. ఆ పుకార్లను తొలుత ఆ ఇద్దరూ ఖండించారు. చివరికి ఏమయ్యింది.? ఇద్దరూ విడిపోయారు.. వేర్వేరు దారులు చూసుకున్నారు.

సాధారణ పౌర సమాజంలో కూడా ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు.. ఇదంతా ఓ ప్రసహనం. అవి అలా జరుగుతుంటాయ్ అంతే.! మారిన కాలమాన పరిస్థితుత్లో ఇదంతా న్యూ నార్మల్ అంతే.

Rashmika Vijay Divorce Rumors.. పుకార్ల ప్రవాహానికి అడ్డుకట్ట పడేదెలా.?

విజయ్ దేవరకొండ అంటే, చాలామంది నెటిజన్లకు గిట్టదు. అతని మీద కుప్పలు తెప్పలుగా రూమర్స్ సృష్టిస్తూనే వుంటారు. ఇదొక నిరంతర ప్రక్రియ.

మరోపక్క, రష్మిక మండన్నకి కూడా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన నెగెటివిటీ సర్వసాధారణం. ‘క్రింజ్ వేషాలు వేస్తుంటుంది’ అన్నది రష్మిక మీద ప్రధాన ఆరోపణ.

Rashmika Mandanna Vijay Deverakonda
Rashmika Mandanna Vijay Deverakonda

సరే, అదంతా ఓ యెత్తు. ప్రేమించి, పెళ్ళి చేసుకున్నారు కదా.. సఖ్యతతోనే వున్నారు కదా.. మధ్యలో పుకార్లు ఎందుకు.? అన్న ఇంగితం ఎవరికీ వుండటం లేదు.

నిజానికి, ఇక్కడ చిచ్చు పెట్టింది బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్. ‘కాఫీ విత్ కరణ్’ అనే టాక్ షో ద్వారా, సంచలనాల కోసం ప్రయతనిస్తుంటాడు కరణ్ జోహార్.

ప్రశ్నలు.. పైత్యాలు..

ఆ కార్యక్రమానికి విజయ్, రష్మిక హాజరయ్యారు. అక్కడ ఏవేవో ప్రశ్నలు, వాటికి ఏవేవో సమాధానాలు. ఈ క్రమంలోనే రెడ్ ఫ్లాగ్ అంశమొకటి తెరపైకి వచ్చింది. 100 సార్లు ప్రపోజల్.. అనేది మరో వివాదాస్పద అంశం.

ఇటు విజయ్ మీదా, అటు రష్మిక మీదా.. విమర్శలు, ట్రోలింగ్.. చివరికి ‘విడాకులు’ అంటూ పుకార్లు. చేసేది లేక, రష్మిక అలానే విజయ్.. సోషల్ మీడియా వేదికగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు.

సాధారణంగా అయితే, వివరణ తర్వాత, పుకార్ల జోరు తగ్గిపోవాలి. కానీ, అనూహ్యంగా మరింత పెరిగిపోయింది.

చాలామంది ఇలా బుకాయించినవాళ్ళే.. మీరిద్దరూ విడిపోయినప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం.. అని సెటైర్లేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కొందరు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group