Home » అమిత్ షా – చిరు భేటీ.! రాజకీయమేం లేదుగా.!?

అమిత్ షా – చిరు భేటీ.! రాజకీయమేం లేదుగా.!?

by Mudra369 Editorial Desk
0 comments
Chiranjeevi Amit Shah

Chiranjeevi Amit Shah Politics.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి.. ఈ ఇద్దరూ కలిస్తే, రాజకీయాలు చర్చకు రాకుండా వుంటాయా.?

చిరంజీవి అంటే, కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి పెద్దన్నయ్య. ఆ జనసేన పార్టీ, బీజేపీకి మిత్రపక్షం.!

గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చిరంజీవి ప్రస్తుతం యాక్టివ్‌గా లేకపోవచ్చు. కానీ, చిరంజీవి ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవడం లేదు.

హైద్రాబాద్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి వెళ్ళారు.

Chiranjeevi Amit Shah Politics.. సినిమాలూ.. రాజకీయాలూ..

మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి.. కలిస్తే, సహజంగానే రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తాయి. గత కొంతకాలంగా, చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మని పలువురు బీజేపీ నాయకులు కోరుతున్నారు కూడా.

అయితే, చిరంజీవి మాత్రం తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నాననీ, అసలంటూ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేననీ తెగేసి చెబుతున్నారు.

Ramcharan Amit Shah Chiranjeevi
Ramcharan Amit Shah Chiranjeevi

అసలు విషయమేంటంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీప్ ఫేక్.. వీటి ద్వారా నటీనటుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందన్న విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు చిరంజీవి.

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని కేంద్ర మంత్రి అమిత్ షా‌ – చిరంజీవి భేటీ సందర్భంగా చర్చకు వచ్చాయట.

డీప్ ఫేక్ మహమ్మారి..

ఏఐ – డీప్ ఫేక్ వ్యవహారాలకు సంబంధించి, చిరంజీవి ఇప్పటికే న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. కొంత రక్షణ కూడా పొందారు.

పలువురు హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవడం, ఈ విషయమై సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవికి పలు విజ్ఞప్తులు అందడం తెలిసిన విషయాలే.

కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాలన్నిటినీ చిరంజీవి తీసుకెళ్ళారని తెలుస్తోంది. పనిలో పనిగా రాజకీయ పరమైన అంశాలు కూడా ఇరువురి మధ్యా చర్చకు వచ్చే వుంటాయి.

ఇదిలా వుంటే, చిరంజీవిని రాజ్యసభకు పంపుతారనీ, చిరంజీవికి గవర్నర్ గిరీని బీజేపీ ఆఫర్ చేసిందనీ.. గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group