Home » గ్రౌండ్ రిపోర్ట్: ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ పుంజుకున్నట్లేనా.?

గ్రౌండ్ రిపోర్ట్: ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ పుంజుకున్నట్లేనా.?

by Mudra369 Editorial Desk
0 comments
Ys Jagan Mohan Reddy

Jagan Gains Political Momentum.. స్థానిక ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా వుంటాయన్నది రాజకీయాల్లో బలంగా వినిపించేమాట.!

అదే సమయంలో, విపక్షాలు పుంజుకోవడానికి కూడా స్థానిక ఎన్నికలే కారణమవుతాయి.. అదీ గెలుపోటములకతీతంగా.!

వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలు, ఆ ఎన్నికల్లో జరిగిన గొడవలు, అప్పటి అధికార వైసీపీ సృష్టించిన అరాచకం, విపక్షాలు ఒక్కటయ్యేలా చేసింది.

ఇప్పుడు టీడీపీ హయాంలో జరిగిన, జరుగుతున్న స్థానిక ఎన్నికల వ్యవహారం కూడా అలాగే మారుతోంది.! అనూహ్యంగా విపక్షం వైసీపీ, ప్రజల్లోకి బలంగా వెళ్ళగలిగింది.

Jagan Gains Political Momentum.. వైసీపీకి అనుకూల వాతావరణం..

మెజార్టీ స్థానాలు కూటమికే దక్కినా, కూటమి పార్టీలోనే సంతృప్తి లేదన్నది నిర్వివాదాంశం. గెలుపోటములకతీతంగా వైసీపీ గురించిన చర్చ జరుగుతోందిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.

వాస్తవానికి, వైసీపీ స్థానిక ఎన్నికల విషయమై చేతులెత్తేసింది. అయితే, పలు ప్రాంతాల్లో జరిగిన దాడులు, ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసమర్థతపై చర్చ జరగడం.. ఇవన్నీ వైసీపీకి కలిసొచ్చాయి.

కూటమి పార్టీల మధ్యన సఖ్యత లేకపోవడం వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారింది. గెలిచిన కొన్ని సీట్లు కూడా వైసీపీకి బోల్డంత బలాన్నిచ్చాయిప్పుడు.

వైసీపీ అధినాయకత్వం గనుక, స్థానిక ఎన్నికల్ని ఇంకాస్త సీరియస్‌గా తీసుకుని వుంటేనా.? అని వైసీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు.

పులివెందులలో దెబ్బ తగిలిందిగానీ..

పులివెందులలో వైసీపీ ఓడిపోవడమొక్కటీ, వైసీపీకి అస్సలేమాత్రం మింగుడు పడని విషయం. అక్కడే ఎక్కువగా ఏకగ్రీవాలు కూడా జరిగిపోవడం, వైసీపీకి పెద్ద దెబ్బ.

రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. పైగా, ముందే చెప్పుకున్నట్లు స్థానిక ఎన్నికల్లో అధికారంలో వున్నవారికి ఆ అడ్వాంటేజ్ వుంటుంది.

ఎటూ, త్వరలో పాదయాత్ర.. అని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించేసి వున్నారు గనుక, బెంగళూరు నుంచి పూర్తిగా తాడేపల్లికి మకాం మార్చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఆయనకి.

అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు, క్యాడర్‌ని యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదనే వుంది.! లేదూ, ఇంకా కాలయాపన చేస్తే, వైసీపీకే నష్టం.

మరోపక్క, కూటమి పార్టీలు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగాల్సిన అవసరం వుంది. వైసీపీ పుంజుకోకూడదంటే, కూటమి మధ్యన సఖ్యత మరింతగా పెరగాల్సిందే.

లేదూ, షరామామూలుగానే కూటమి పార్టీలు తమలో తాము కొట్టుకుంటే, అది వైసీపీకే పూర్తిస్థాయిలో సానుకూల రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group