Home » వైసీపీ చచ్చిపోయిందన్న నాగబాబు.! తప్పు కదా.! అలా అనొచ్చా.?

వైసీపీ చచ్చిపోయిందన్న నాగబాబు.! తప్పు కదా.! అలా అనొచ్చా.?

by Mudra369 Editorial Desk
0 comments
Nagababu Janasena

YSRCP Dead Party Nagababu.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అనగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.! బహుశా తమ పార్టీ పేరుని వైసీపీ కార్యకర్తలే మర్చిపోయి వుంటారు.!

ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బతికే వుందా.? అసలంటూ, చచ్చిపోయిందన్న అనుమానం ఎందుకు కలుగుతోంది.?

విషయమేంటంటే, జన సేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఈ అనుమానాల్ని తెరపైకి తెచ్చారు. కాదు కాదు, ఆయన చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు వైసీపీ చచ్చిపోయిందని.!

రాజకీయ పార్టీ చచ్చిపోవడమేంటి.? ఇప్పటికీ వైసీపీకి దాదాపు 39 శాతం ఓటు బ్యాంకు వుందనే కదా, ఆ పార్టీ ‘క్లెయిమ్’ చేసుకుంటోంది.?

వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలున్నారు.. లోక్ సభ సభ్యులు, రాజ్య సభ సభ్యులు కూడా వున్నారు కొంతమంది.!

ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ అక్కడక్కడా తన ఉనికిని చాటుకుంటూనే వుంది. ఔను, ఉనికిని మాత్రమే చాటుకుంటోంది.

నాగబాబు చెబితే, వైసీపీ చచ్చిపోయినట్లేనా.?

ఏ ఉద్దేశ్యంతో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారోగానీ, ఒక్కసారిగా వైసీపీ ‘మూక దాడికి’ తెగబడుతోంది జన సేన పార్టీ మీద.! టీడీపీ సంకలో కూర్చుని, నాగబాబు ప్రేలాపనలు ఎక్కువయ్యాయన్నది వైసీపీ ఆరోపణ.

జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అనీ, దత్త పుత్రుడనీ.. వైసీపీ రాజకీయ విమర్శలు చేయగా లేనిది, వైసీపీని డెడ్ పార్టీ.. అని జన సేన నేత నాగబాబు విమర్శిస్తే తప్పెలా అవుతుంది.?

రాజకీయాలన్నాక విమర్శలు సహజం.! నాగబాబు విమర్శలు కూడా అంతే.! వైసీపీ నుంచి వచ్చే ఎదురుదాడి కూడా సర్వసాధారణం.!

నాగబాబు అన్నారు కాబట్టి వైసీపీ చచ్చిపోదు.! కానీ, తమ పార్టీ చచ్చిపోలేదని నిరూపించుకోవాల్సిన అగత్యం వైసీపీకి ఏర్పడింది.

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా గోల పక్కన పెట్టి, అసెంబ్లీకి హాజరయి, తమ పార్టీ బతికే వుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకోవాలిప్పుడు.

లేదూ, నాగబాబు మీద రాజకీయంగా ఎదురుదాడికి దిగుతాం.. అని వైసీపీ అనుకుంటే, వైసీపీ నిజంగానే చచ్చిపోతుంది సమీప భవిష్యత్తులో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group