Home » వైసీపీకి శ్రీరెడ్డి లేని లోటుని భర్తీ చేస్తున్న శ్యామల.!

వైసీపీకి శ్రీరెడ్డి లేని లోటుని భర్తీ చేస్తున్న శ్యామల.!

by Mudra369 Editorial Desk
0 comments
Syamala YSRCP

Shymala Sri Reddy YSRCP.. శ్రీరెడ్డి తెలుసు కదా.? సోషల్ మీడియా వేదికగా అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతూ, వైసీపీని వెనకేసుకొస్తూ, వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడేది.

ఎంతలా గొంతు చించుకున్నా, వైసీపీలో ఆమెకు ‘తగిన’ పదవి దక్కలేదనుకోండి.. అది వేరే సంగతి. ప్రస్తుతం శ్రీరెడ్డితో పోటీ పడేందుకు తెగ ఉబలాటపడిపోతోంది శ్యామల.

వైసీపీలో శ్యామలకి అధికార ప్రతినిథి హోదా వుంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో, శ్యామల కూడా శ్రీరెడ్డిలానే తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకోవాలనుకుంటోంది.

తాజాగా, విజయవాడలో వైసీపీ నిర్వహించిన ధర్నా సందర్భంగా, ‘మజ్జిగలో పందార కలుపుకో.. తియ్యగుంటది..’ అంటూ నారా లోకేష్ మీద వెకిలి వ్యాఖ్యలు చేసింది శ్యామల.

Shymala Sri Reddy YSRCP.. ఎగిరెగిరి పడితే.. ఏం జరుగుతుందో..

రాజకీయాలన్నాక విమర్శలు సహజం. కానీ, దిగజారుడు విమర్శలు హుందాతనాన్ని ఇవ్వవు.

మరీ, తన స్థాయిని మరచి రాజకీయ విమర్శలు చేస్తే, పర్యవసానాలు ఎలా వుంటాయో శ్యామల నేరుగా పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ తదితరుల్ని అడిగి తెలుసుకుంటే మంచిది.

2024 ఎన్నికల ఫలితాలకు ముందు, విశాఖలో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.. నేను వెళుతున్నా.. అంటూ, నానా యాగీ చేసింది శ్యామల.. ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరిగిందో చూశాం.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారంటూ శ్యామల చేసిన వెటకారాలు అన్నీ ఇన్నీ కావు. అధినేత జగన్ మెప్పు కోసం శ్యామల ఇలా హద్దులు మీరి వెటకారాలు చేయడం కొత్తేమీ కాదు.

బెజవాడ ఎండలకి మతి పోయిందేమో.. మజ్జిగలో పందార కలుపుకుని తాగమంటూ నారా లోకేష్‌కి ఉచిత సలహా ఇచ్చిన శ్యామల, ముందు తానే ఆ సలహా పాటించి వుంటే, ఆమ నోట ఇలాంటి వ్యాఖ్యలు వచ్చేవి కావు.

లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి.. చనువూ వుంది. ‘నాకేదైనా అంశం మీద అనుమానమొస్తే, పవనన్నకి ఫోన్ చేసి తెలుసుకుంటాను..’ అంటూ లోకేష్ ఈ మధ్యనే ఓ సందర్భంలో చెప్పారు.

‘అరేయ్ లోకేష్..’ అని నాకు పవనన్న ఫోన్ చేస్తారు.. అని లోకేష్ చెప్పిన మాటల్ని, శ్యామల వెటకారం చేసిన తీరు అత్యంత అసభ్యకరం. అయినా, వైసీపీ నాయకుల నుంచి రాజకీయాల్లో హుందాతనాన్ని ఎలా ఆశించగలం.?

అన్నట్టు, శ్యామల చరిత్ర గురించి శ్రీరెడ్డికి బాగా తెలుసు. వైసీపీలో ఆమెకు ఆ పదవి ఎలా వచ్చిందో కూడా శ్రీరెడ్డి ఓ వీడియోలో సవివరంగా పేర్కొందనుకోండి.. అది వేరే సంగతి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group