తొలి సినిమా ఇంకా విడుదల కాలేదుగానీ, వరుస ఛాన్సులు దక్కించేసుకుంటోంది బొద్దుగుమ్మ కేతిక శర్మ (Ketika Sharma To Romance Panja Vaishnav Tej) . సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమాలో పూరి ఆకాష్ సరసన కేతిక శర్మ (Kethika Sharma Hot) నటించిన విషయం విదితమే.
అనిల్ పాడూరి ఈ ‘రొమాంటిక్’ చిత్రానికి దర్శకుడు. పూరి జగన్నాథ్ (Director Puri Jagannath) ఈ చిత్రానికి కథ అందించాడు. ఛార్మితో (Charmy Kaur) కలిసి పూరి ఈ ‘రొమాంటిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, ‘ఆహా’ ఓటీటీ కోసం ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో (Allu Arjun) కలిసి ఓ ప్రమోషనల్ యాడ్‌లో నటించింది కేతిక శర్మ (Ketika Sharma Spicy).
ఈ బ్యూటీ నాగ శౌర్య (Naga Shaurya) సరసన ‘లక్ష్య’ (Lakshya Telugu Movie) సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతలోనే ఈ బ్యూటీ చేతికి మరో ప్రెస్టీజియస్ ఆఫర్ అందిందట. అదే, మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టనుండడం.
‘ఉప్పెన’ (Uppena) సినిమాతో విమర్శకుల ప్రశంసల్నీ, సెన్సేషనల్ కమర్షియల్ విజయాన్నీ అందుకున్న మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) సరసన కేతిక శర్మ (Ketika Sharma To Romance Panja Vaishnav Tej) నటించబోతోందట.

‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దగ్గర శిష్యరికం చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
గిరీశాయ ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ని తెరకెక్కించాడు. విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించాడు ‘అర్జున్ రెడ్డి‘ సినిమాలో.
కేతిక శర్మ (Kethika Sharma Hot) అనగానే సోషల్ మీడియాని ఆమె తన హాట్ ఫొటోలతో, వీడియోలతో షేక్ చేసేసిన వైనం గుర్తుకొస్తుంటుంది. ‘రొమాంటిక్’ సినిమా ప్రమోషన్లలోనూ చాలా హాట్‌గా కనిపించేసింది ఈ బ్యూటీ.