Sunny Leone Tollywood: భారతీయ మూలాలున్న కెనడా భామ సన్నీలియోన్. భారతీయ సినిమా తెరపైకి అనూహ్యంగా దూసుకొచ్చి, అతితక్కువ కాలంలోనే ‘బోల్డ్’ పేరు ప్రఖ్యాతలు తెచ్చేసుకుంది.
అయితే, ఇదివరకటి జోరు ఆమె కెరీర్‌లో కనిపించడం లేదు. అలాగని మరీ ఆమె కెరీర్ అంత దారుణంగానూ లేదు.
రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే.. అంటోందట. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా ఆమెకి సంబంధం లేదు. తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. నిర్మాతల నుంచి గట్టిగానే పిండుకుంది. ఈ సారి ముచ్చటగా మూడోది.
Sunny Leone Tollywood సన్నీలియోన్.. సమర్పయామి.!
ఆమె పిండుకోనక్కర్లా.! గట్టిగా దుడ్లు సమర్పించుకునే ఆమెను తీసుకొస్తున్నారు నిర్మాతలు. అయినా, అంతలా ఆమె వెంట పడ్డానికి ప్రత్యేకమైన, బలమైన కారణమేంటట.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.!
తమన్నా, శృతిహాసన్ లాంటోళ్లు స్పెషల్ సాంగ్స్ చేసేస్తున్నారు. ఈ మధ్య సమంత కూడా మొదలెట్టేసింది. సూపర్ హిట్టు కొట్టేసింది. లైన్లో చాలామంది అందాల భామలున్నారు స్పెషల్ సాంగ్స్ పేరుతో స్పెషల్ కిక్ ఇచ్చేందుకు.
కానీ, అలాంటి వాళ్లందర్నీ కాదని సన్నీలియోన్‌ని ఎత్తుకొచ్చుండేందీ.? ఆమె వల్ల ఆయా సినిమాలకు ఒరిగేదేముంది.?
ఏముంది సన్నీలియోన్‌లో అంత ప్రత్యేకంగా.?
ఏదో అనుకుని, లాక్కొచ్చాం.. కానీ నష్టపోయాం.. అని గతంలోనే ఓ సారి నిట్టూర్చారు. ఇప్పుడు ఇంకో సారి అలా నిట్టూర్చడానికి రెడీ అయిపోయారేమో.
Also Read: Kriti Sanon Shines Like Peacock.. మయూరమే.. వయ్యారమే.!
నిట్టూర్పులు తప్పవని తెలిసి, సన్నీలియోన్‌ని పనిగట్టుకుని లాక్కురావడమంటే అబ్బో ఆ ధైర్యం చాలా ప్రత్యేకం సుమీ.!