Pawan Kalyan OG2 Mania.. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఓజీ’ అందుకున్న సంచలన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ కాకుండా, ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చి వుంటే, మరింత సంచలన విజయాన్ని ‘ఓజీ’ అందుకుని వుండేదే.
పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్, సుజీత్ డైరెక్షన్‌కి తోడు, తమన్ మ్యూజిక్.. అందునా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ‘ఓజీ’ని వేరే లెవల్‌లో నిలబెట్టింది.
‘ఓజీ’కి ప్రీక్వెల్ అలానే సీక్వెల్ కూాడా వుంటాయని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఈ విషయమై తాజాగా, ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది.
దర్శకుడు సుజీత్ ప్రస్తుతం విదేశాల్లో వున్నాడనీ, విదేశాల నుంచి సుజీత్ తిరిగి రాగానే, ‘ఓజీ2’ విషయమై స్పష్టత వస్తుందన్నది ా ట్వీట్ సారాంశం.
Pawan Kalyan OG2 Mania.. అంచనాలు, అంతకు మించి..
సో, ‘ఓజీ-2’ కన్ఫామ్ అన్నమాట. ఇదే, ఈ ట్వీటుకే రీచ్ వేరే లెవల్ అయి కూర్చుందిప్పుడు. ఆల్రెడీ 10 మిలియన్లు దాటేసింది రీచ్.
10 మిలియన్ల రీచ్ అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ-2’ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ కాంబినేషన్ క్రేజ్ అలాంటిది మరి.
అయితే, ఇక్కడ కొన్ని చిక్కుముడులున్నాయ్. ఇంతకీ, ‘ఓజీ-2’ ఏంటి.? ప్రీక్వెలా.? సీక్వెలా.? దర్శకుడు సుజీత్, ఆల్రెడీ హీరో నానితో కమిట్ అయ్యాడు కదా.?
మరోపక్క, పవన్ కళ్యాణ్ కూడా ఇంకో ప్రాజెక్టుకి మొన్నామధ్యన లైన్ క్లియర్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా అది.
ఇన్ని చిక్కుముడులు ఎప్పుడు వీడతాయో ఏమో.! ప్రస్తుతానికైతే, ‘ఓజీ-2’ మేనియా ఓ రేంజ్‌లో వుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
విదేశాల నుంచి దర్శకుడు సుజీత్ రావాలి.. వచ్చాక, స్పష్టత ఇవ్వాలి. అప్పటిదాకా, ‘ఓజీ-2’ మేనియా అస్సలు తగ్గేలా కనిపించడంలేదు.
ఒకవేళ, సుజీత్ వెంటనే ‘ఓజీ-2’ ప్రాజెక్టుని టేకప్ చేస్తేనో.! అంతకన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సింది ఏముంటుంది.?
