Home » గ్రౌండ్ రిపోర్ట్: సీఎం కుర్చీ పవన్ కళ్యాణ్‌కి ఎంత దూరం.?

గ్రౌండ్ రిపోర్ట్: సీఎం కుర్చీ పవన్ కళ్యాణ్‌కి ఎంత దూరం.?

by Mudra369 Editorial Desk
0 comments
Pawan Kalyan

Pawan Kalyan CM Chair.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం పవన్ కళ్యాణ్.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం.!

ప్రజారాజ్యం పార్టీలో యూత్ వింగ్ అధ్యక్షుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో పెట్టడానికి మాత్రం, చాలా ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది.

2014 ఎన్నికల్లో జన సేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. కానీ, జన సేన పార్టీ నుంచి ఒకే ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఏం లాభం.? గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జన సేన పార్టీని వీడి, అప్పటి అధికార పక్షం వైసీపీలో చేరిపోయారు. అప్పుడే, అసలు సిసలు రాజకీయం మొదలైంది.

Pawan Kalyan CM Chair.. పదునైన రాజకీయ వ్యూహాలు..

రాజకీయ వ్యూహరచనలో తనకు సాటి ఇంకెవరూ లేరన్న చందాన, ‘వైసీపీని అదఃపాతాళానికి తొక్కుతా’ అంటూ, టీడీపీ – జన సేన – బీజేపీ కూటమి కోసం వ్యూహరచన చేశారు.

ఫలితం, 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, 2024 ఎన్నికలకొచ్చేసరికి కేవలం 11 సీట్లకు పరిమితమైపోయింది. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో, పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలానే 2 లోక్ సభ స్థానాల్లోనూ గెలుపొందింది జన సేన.

జన సేనాని పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జన సేన పార్టీకి మరో రెండు మంత్రి పదవులూ దక్కాయి కూటమి ప్రభుత్వంలో.

ఇక్కడివరకు బాగానే వుంది. 2029 ఎన్నికలకు జన సేనాని వ్యూహమేంటి.? ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ ఎంత దూరంలో వున్నారు.? ఇదిప్పుడు హాట్ డిబేట్.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారతాయో ఎవరూ ఊహించలేరు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ వుంది జన సేన, రాజకీయంగా.

గెలుపోటములు సర్వసాధారణం..

విజయాలే కాదు, అపజయాలూ వుంటాయని పవన్ కళ్యాణ్ కంటే బాగా ఇంకెవరికి తెలుసు.? అందుకే, అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు.

ఇంకో రెండు మూడు దఫాలు కూటమి కలసికట్టుగా ఎన్నికల్ని ఎదుర్కోవాలి.. అంటూ, పదే పదే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే, రాష్ట్ర అభివృద్ధి అనీ చెబుతున్నారాయన.

వయసు రీత్యా, చంద్రబాబు ఎంత కాలం రాజకీయాల్లో యాక్టివ్‌గా వుంటారన్నదానిపై భిన్న వాదనలున్నాయి. చంద్రబాబు కాకపోతే, లోకేష్ ‘సీఎం అభ్యర్థి’ రేసులో వుంటారన్నది టీడీపీ వాదన.

టీడీపీ, అలా అనుకోవడంలో వింత లేదు. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని జన సేన శ్రేణులూ కోరుకోవచ్చు. కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై కూటమి సమిష్టి నిర్ణయం తీసుకోవాలి.

ఒక వేళ కూటమి పార్టీలు, 2029 నాటికి చెరో దారి అయిపోతే.? అప్పటికి జన సేన బలం ఏ స్థాయికి పెరుగుతుంది.? సొంతంగా అధికార పీఠమెక్కే పరిస్థితి వుంటుందా.?

బలమెంత పెరిగింది.?

తాజా అంచనాల్ని బట్టి, జన సేన పార్టీ బలం గణనీయంగా పెరిగింది. 20 నుంచి 30 శాతం వరకు ఓటు బ్యాంకు జన సేన పార్టీకి స్థిరంగా వుండొచ్చన్నది ఓ అంచనా.

అదే నిజమైతే, ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ కూత వేటు దూరంలోనే వున్నట్లు లెక్క. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీకి జన సేన ప్రత్యామ్నంగా మారుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అవుతారు. సో, ముక్కోణపు పోటీ అంటూ జరిగితే, నో డౌట్.. కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్.! ఎలా చూసినా, 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెండుగా వున్నాయి.

అయితే, ఇవన్నీ ‘జన సేన పార్టీ’కి సంబంధించి సానుకూల అంచనాలు మాత్రమే. పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారతాయో చెప్పలేమని, ఆల్రెడీ చర్చించుకున్నాం కదా.!

పార్టీని బలోపేతం చేసే విషయమై పవన్ కళ్యాణ్ మరింత పదునైన వ్యూహాలు అమలు చేయాలి. మరీ ముఖ్యంగా, లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గా వారీగా.. బలమైన కమిటీల్ను ఏర్పాటు చేయాల్సి వుంది.

‘సమయం లేదు మిత్రమా..’ అంటూ ఓ సినిమా డైలాగొకటుంటుంది. ఔను, సమయం తక్కువగానే వుంది.. ఇలా పదునైన వ్యూహాలు రచించడానికి.! జన సేనాని ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group