Home » ‘ఏఐ డీప్ ఫేక్’ రోగం: సమంతకి చట్టపరమైన రక్షణ.!

‘ఏఐ డీప్ ఫేక్’ రోగం: సమంతకి చట్టపరమైన రక్షణ.!

by Mudra369 Editorial Desk
0 comments
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu Deepfake.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కడం కాదు, వెర్రి తలలు వేస్తోంది.! శృంగార దేవతలా సమంత మీ ఇంటికి నడిచి వచ్చేస్తోంది.!

మరో హీరోయిన్, మీ జీవిత భాగస్వామిలా మిమ్మల్ని ‘కోరికల గుర్రాలు’ ఎక్కించేస్తోంది.! అసలేం జరుగుతోంది.? ఇదంతా నిజ్జంగా నిజం కాదు.!

ఏఐ టూల్స్ వినియోగం మీకు తెలిస్తే చాలు, సబ్‌స్క్రిప్షన్ చెల్లించగలిగే సొమ్ములు మీ దగ్గర వుంటే ఇంకాస్త బెటర్.! ఎంచక్కా, నచ్చినట్లు వీడియోలు సృష్టించేసుకోవచ్చు. ఫొటోలూ తయారు చేసేసుకోవచ్చు.

రాజులు, రాజ్యాల.. కాలానికి వెళ్ళిపోవచ్చు.. మీతోపాటు, మీకు నచ్చిన సినీ నటిని ఆ శృంగార సామ్రాజ్యంలో, మీ పడక గదిలోకి తీసుకెళ్ళిపోవచ్చు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇదిప్పుడు ఓ వ్యసనంలా తయారైంది. మహమ్మారిలా వెర్రి తలలు వేస్తోంది.

చిరంజీవి సహా పలువురు హీరోలు, తమ ఫొటోల్ని లేదా వీడియోల్ని ‘ఏఐ’ ద్వారా ఎవరూ దుర్వినియోగం చేయకుండా న్యాయస్థానాల నుంచి రక్షణ పొందిన సంగతి తెలిసిందే.

తాజాగా, సినీ నటి సమంత కూడా కోర్టు నుంచి ఇదే తరహా ఊరట పొందింది. నిజానికి, మొత్తంగా సినీ జనాలంతా కోర్టుల్ని ఆశ్రయించి, కోర్టుల ద్వారా రక్షణ పొందాల్సిందేనేమో.

మరి, సామాన్యుల పరిస్థితేంటి.? పక్కింటమ్మాయి, ఎదురింటి మహిళ, స్కూల్ టీచర్, హాస్పిటల్‌లో డాక్టర్, పోలీస్ స్టేషన్‌లో మహిళా అధికారి.. అందరికీ ఇదే సమస్య.. ఏఐ కంటెంట్ కారణంగా.

ప్రధాన మంత్రినీ వదలట్లేదంటే, పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. లక్షల్లో కాదు, కోట్లల్లో వీడియోలు రోజూ కొత్తగా పుట్టుకొచ్చేస్తున్నాయి ఏఐ సాంకేతికతను వినియోగించి.

ఎక్కడన్నా ఏదన్నా దుర్ఘటన జరిగితే, ఆ ఘటన ఎలా జరిగి వుంటుంది.? అన్న విషయమై ‘ఏఐ టూల్స్’కి సమాచారం ఇస్తే, వాస్తవానికి దగ్గరగా వుండేలా వీడియో డిజైన్ చేసి ఇచ్చేస్తుండడం చూస్తున్నాం.

సైబర్ చట్టాలకు వున్నపళంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్’ కారణంగా వచ్చింది.

లేకపోతే, వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకు.. అర్థం లేకుండా పోతుందన్నది నిర్వివాదాంశం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group