TVK Vijay YSRCP Jagan.. ఎన్నికల ప్రచార సమయంలో తమిళ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోని చూపించారు.
అసలేం జరిగిందంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు, తమిళనాడులో విజయ్ ఎన్నికల ప్రచార సమయంలో, ఆ ఫొటోని అందించారు.
ఎన్నికల ప్రచారం అంటే, అందర్నీ కలుపుకుపోవాలి. అలా కొందరు ఇచ్చిన ఆ ఫొటోని విజయ్, తన చేత్తో పట్టుకుని చూపించారు. అదీ జరిగిన విషయం.
అంతకు ముందు, వైఎస్ జగన్ బంధువు పెళ్ళి నేపథ్యంలో చెన్నయ్‌కి వెళితే, అదే వివాహ వేడుకకి అతిథిగా హాజరైన విజయ్, అక్కడ ఆ వేడుకలో జగన్‌ని కలిశారు.
అలా జగన్, విజయ్ కలిసిన ఫొటోనే, విజయ్ ఎన్నికల ప్రచారంలో జగన్ అభిమానులు విజయ్‌కి అందించారు. ఇదీ అసలు కథ.
TVK Vijay YSRCP Jagan.. విజయ్ పార్టీ టీవీకేని గెలిపించిన వైఎస్సార్సీపీ.?
ఆ ఫొటో చూపించడం వల్లే విజయ్ గెలిచాడు. విజయ్ పార్టీ గెలిచింది. విజయ్ గెలుపు కోసం వైసీపీ అభిమానులు తమిళనాడులో పని చేశారు.. అని వైసీపీ నేతలు కొందరు చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తోంటే, తమిళనాడులో విజయ్ అభిమానులకి, టీవీకే పార్టీ కార్యకర్తలకీ చిర్రెత్తుకొచ్చేస్తోంది.
విజయ్‌ని జగన్ గెలిపించడమేంటి.? అలా గెలిపించే సత్తా జగన్‌కే వుంటే, వైసీపీనే 2024 ఎన్నికల్లో గెలిపించుకుని, ముఖ్యమంత్రిగా కొనసాగి వుండేవాడు కదా.. అన్నది టీవీకే కార్యకర్తల వాదన.
Also Read: ఓ తండ్రి ప్రతీకారం.!
చిత్రమేంటంటే, జగన్ – విజయ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలని ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు.
సమీప భవిష్యత్తులో విజయ్ – జగన్ కలిసి పని చేస్తారని కూడా వైసీపీ కార్యకర్తలు నినదిస్తున్నారు. అంటే, ఏపీ రాజకీయాలు వదిలేసి జగన్, తమిళనాడుకి వెళ్ళిపోతారా.?
టీవీకే విజయ్ అయితే, తమిళనాడు రాజకీయాలు వదిలేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసే పరిస్థితి వుండదు.
