Home » టీవీకే విజయ్ గందరగోళం! తమిళ రాజకీయాల్లో ట్విస్టులే ట్విస్టులు!

టీవీకే విజయ్ గందరగోళం! తమిళ రాజకీయాల్లో ట్విస్టులే ట్విస్టులు!

by hellomudra
0 comments
TVK Vijay

TVK Vijay Confusion Politics.. రాజకీయాలు ‘క్లీన్’గా లేవు.! అలా ‘క్లీన్’గా వుండాలని ఎవరైనా అనుకుంటే, అదో పచ్చి బూతు.. ఈ రోజుల్లో.!

118 ఎమ్మెల్యేల మ్యాజిక్ మార్కుకి పది అడుగుల దూరంలో ఆగిపోయారు టీవీకే అధినేత విజయ్, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతుని తీసుకున్నారాయన.

అయినాగానీ, మొత్తంగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే వుంది టీవీకే విజయ్‌కి. ముఖ్యమంత్రి అవ్వాలంటే, ఆ సంఖ్య సరిపోదు.

ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చెయ్యాలంటే, ముందుగా గవర్నర్ అనుమతి వుండాలి. గవర్నర్ వద్ద తన బలాన్ని నిరూపించుకోవాల్సి వుంటుంది టీవీకే విజయ్‌కి.

TVK Vijay.. తెలిసే తప్పు చేసిన టీవీకే విజయ్.?

కానీ, 112 మంది ఎమ్మెల్యేల మద్దతు వుందన్న విషయాన్ని గవర్నర్ వద్దకు వెళ్ళి మరీ చెప్పారు టీవీకే విజయ్. ‘కుదరదు, 118 నంబర్ వుండాల్సిందే’ అని గవర్నర్ చెప్పారట.

దాంతో, తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ పదవీ ప్రమాణ స్వీకారం చేసి వుండేవారే.

కానీ, గవర్నర్ కారణంగా విజయ్ పదవీ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఇంతలోనే, తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్ మారిపోయింది.

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చేలా వున్నాయిప్పుడు. ఇరు పార్టీలూ తమ తమ ఎమ్మెల్యేలను విడివిడిగా రిసార్టుల్లో వుంచి, రాజకీయాలు నడుపుతున్నాయి.

మరోపక్క టీవీకే విజయ్ కూడా, తన ఎమ్మెల్యేలను రిసార్టులకి తరలించి, సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు.. ఎవరూ చేజారిపోకుండా.!

ఒకవేళ డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే, అదో ఆసక్తికరమైన అంశమవుతుంది తమిళనాడు రాజకీయాల్లో.

ప్రభుత్వం ఏర్పాటు చేశాక, ఎమ్మెల్యేలను టీవీకే నుంచి లాగెయ్యడం డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు పెద్ద కష్టమేమీ కాదు. తమిళనాడులో ఈ తరహా రాజకీయాలు ఎప్పటినుంచో నడుస్తున్నవే.

ఒకవేళ అదే జరిగితే, టీవీకే విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది.? అసలంటూ, ఇప్పుడు ఏ ప్రభుత్వమూ ఏర్పడక, మళ్ళీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి దాపురిస్తేనో.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group