Rakul Preet IT Raids Telangana..సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మీద బోల్డన్ని వార్తల్ని చూస్తున్నాం. వాటిల్లో కొన్ని గాసిప్స్ కూడా.! ఇంకొన్ని పుకార్లు. మరికొన్ని వార్తలు.!
వార్తకీ, పుకారుకీ చాలా తేడా వుంది. రకుల్ ప్రీత్ సింగ్ సహా, ఆమె కుటుంబంపై ఇటీవల ఐటీ సోదాలు జరిగాయి. సినిమా నిర్మాణం ముసుగులో విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.
రకుల్ భర్త, సినీ నిర్మాత.! ఈ క్రమంలోనే ఐటీ సోదాలు జరిగాయి. సోదాల్లో ఏం జరిగిందన్నదానిపై ఆదాయపు పన్ను శాఖ ఇప్పటిదాకా వివరణ ఇవ్వలేదు.
మరోపక్క, ఐటీ సోదాలు జరగడంపై రకుల్ ప్రీత్ సింగ్ కాస్త లేటుగా స్పందించింది. పనిలో పనిగా, తెలంగాణలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారంపైనా.. పరోక్షంగా స్పష్టతనిచ్చింది.
Rakul Preet IT Raids Telangana.. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చా..
ఆర్మీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాననీ, బాధ్యతగల భారత పౌరురాలిననీ రకుల్ ప్రీత్ సింగ్ తన గురించి తాను చెప్పుకుంది.
సినీ పరిశ్రమలో తనకెవరూ గాడ్ ఫాదర్ లేరన్న రకుల్ ప్రీత్ సింగ్, చాలా పద్ధతిగా తాను ప్రతి యేడాదీ ఆదాయపు పన్ను కడుతున్నాననీ, ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని వివరణ ఇచ్చింది.

అంతే కాదు, ఐటీ సోదాలు తన వ్యక్తిగత సంపాదన గురించి కాదనీ, ఆ సోదలతో తనకు సంబంధం లేదనీ, సంచలన వార్తల ముసుగులో ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరింది రకుల్.
మీడియా సంస్థలు, మీడియా ముసుగులో కొందరు జర్నలిస్టులు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్స్ వెంటనే తన మీద దుష్ప్రచారం మానుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ సున్నితంగా హెచ్చరించింది.
Rakul Preet IT Raids Telangana.. తెలంగాణ రాజకీయాల్లో రకుల్ పేరెందుకు వస్తోంది.?
తెలంగాణలో అధికార – విపక్షాల మధ్య రాజకీయ విమర్శల్లో భాగంగా, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తావన తెస్తున్న సంగతి తెలిసిందే.
మరీ ముఖ్యంగా కేటీయార్ మీద వస్తున్న అక్రమాస్తుల ఆరోపణలకు సంబందించి ‘రకుల్ ప్రీత్ సింగ్ బినామీ’ అనే రాజకీయ ఆరోపణల్ని తరచూ చూస్తున్నాం.
రకుల్ ప్రీత్ సింగ్‌కి ఖరీదైన బహుమతుల్ని కేటీయార్ ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
దాంతో, అటు ఐటీ సోదాల వ్యవహారంపైనా.. ఇటు బినామీ ఆరోపణల వ్యవహారంపైనా ఒకేసారి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించినట్లయ్యింది.
