Table of Contents
The Paradise Collections Report.. ‘ది ప్యారడైజ్’ సినిమాకి ప్రీమియర్స్ నుంచే డిజాస్టర్ టాక్ వచ్చినా, నైజాంలో నిలదొక్కుకుంది.! కారణం తెలిసిందే, ‘తెలంగాణ మట్టి కథ’ అంటూ, ప్రచారం జరగడమే.
ఇంతకీ, ‘ది ప్యారడైజ్’ వసూళ్ళ కథేంటి.? లాభ నష్టాల వ్యవహారమేంటి.? ఎక్కడ సినిమాకి లాభాలొచ్చాయి.? ఎక్కడ ఈ సినిమా నష్టపోతోంది.?
ట్రేడ్ పండితులు ఏమంటున్నారు.? సినిమా టీమ్ ఎలాంటి ప్రచారం చేస్తోంది.? అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఇలా చాాలా ప్రశ్నలు సగటు సినీ అభిమాని మెదళ్ళలో మెదులుతున్నాయి.
నైజాం ఏరియాలో సినిమా గట్టెక్కేసిందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండడాన్ని చూస్తున్నాం. 80 శాతం రికవరీ.. అంటూ, గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.
The Paradise Collections Report.. మాజీ మంత్రి కేటీయార్.. ‘ది ప్యారడైజ్’ సినిమాని చూడటంతో..
రాజకీయ నాయకులు, ఈ సినిమాకి రాజ పోషకులుగా మారుతున్నారా.? అంటే, సినిమాని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటారంతే.. అని చెప్పక తప్పదు.
మాజీ మంత్రి కేటీయార్, ‘ది ప్యారడైజ్’ సినిమాని థియేటర్లో చూడటం ఈ బాపతే. వెళ్ళారు, సినిమా బావుందన్నారు.. తెలంగాణ కథ.. అని సెలవిచ్చారు.
ప్చ్, థియేటర్లు ఆ తర్వాత పెద్దగా నిండిన దాఖలాలు లేవు. అప్పటికే, సినిమా దాదాపుగా తేలిపోయింది. వీకెండ్ వరకూ ఎలాగో నెట్టుకొచ్చేసిన ‘ది ప్యారడైజ్’, ఆ తర్వాత షరామామూలుగానే చప్పబడిపోయింది.
గట్టెక్కడం కష్టమే..
సోమవారం, ఎక్కడా ‘హౌస్ ఫుల్స్’ లేవు. 50 శాతానికి పైగా ఆక్యుపేషన్ వున్న థియేటర్లూ పెద్దగా లేవు. 155 కోట్లు గ్రాస్.. అంటూ ప్రచారమైతే టీమ్ తరఫున జరుగుతోంది.
200 కోట్లకు పైనే గ్రాస్ వస్తే, గట్టెక్కినట్లని ట్రేడ్ పండితులు తాజాగా అంటున్నారు. సోమవారం పరిస్థితిని చూస్తే, ‘ది ప్యారడైజ్’ నష్టాల్ని చూడటం ఖాయమే.
కానీ, ఎంత నష్టం.? అన్నదానిపైనే చర్చ జరుగుతోంది. భారీ నష్టాలనైతే తప్పించుకుందిగానీ.. అంటూ, కొందరు సన్నాయి నొక్కులు నొక్కడం సహజమే.
లెక్కలు తేల్చాల్సిందెవరు.?
అంతిమంగా, నిర్మాత దగ్గర అలానే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరే సరైన లెక్కలుంటాయి. అవెప్పుడూ అధికారికంగా బయటికి రావు. ట్రేడ్ పండితులు చెప్పేవి కూడా అనధికారిక లెక్కలే.
ఒక్కటి మాత్రం నిజం.. నాని స్టామినాకి మించి సినిమా కోసం ఖర్చు చేశారు. అదే, పెద్ద మైనస్.! ‘పెద్దలకు మాత్రమే’ అంటూ వచ్చిన ‘ఎ’ సర్టిఫికెట్ ఇంపాక్ట్ కూడా గట్టిగానే పడింది.
ఏతావాతా చెప్పేదేంటంటే, ఏ ఏరియాలో కూడా ‘ది ప్యారడైజ్’ గట్టెక్కే పరిస్థితి లేదు. నైజాంలో నష్టాలు కాస్త తక్కువ వుండొచ్చంతే.
