Vaishnavi Chaitanya Age.. సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ థింగ్స్ చాలానే జరుగుతుంటాయ్.!
పనీ పాటా లేనోళ్ళే, సోషల్ మీడియాలో ఏదో ఒకటి ‘ట్రెండింగ్’ చేస్తుంటారన్నది సాధారణంగా వినిపించే మాటే.
అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ ‘ట్రెండింగ్’ అంశమే, నటి వైష్ణవి చైతన్య వయసు గురించి జరుగుతున్న చర్చ.!
‘బేబీ’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్డమ్ సంపాదించేసుకుంది నటి వైష్ణవి చైతన్య. అంతకు ముందు ఆమె పలు యూ ట్యూబ్ వీడియోలతో పాపులర్.
సినిమాల్లోకి వచ్చాక, తెలుగు సినిమాలే కాకుండా తమిళ సినిమాలూ చేస్తూ, నటిగా తనదైన గుర్తింపు కోసం తన తంటాలేవో తాను పడుతోంది.
తాజాగా వైష్ణవి చైతన్య నుంచి ‘ఎపిక్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. సినిమాపై నెగెటివ్ టాక్ తెలిసిన విషయమే. సినిమా సూపర్ హిట్టేనని గట్టిగానే ప్రమోషన్స్ చేసుకున్నారనుకోండ.. అది వేరే సంగతి.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య వయసుకు సంబంధించిన డిస్కషన్ జరిగింది.. అదీ ఆమె సమక్షంలోనే. వైష్ణవి చైతన్య వయసు 25 ఏళ్ళు మాత్రమే.. అని ఆ ఇంటర్వ్యూలో తేల్చారు.
కాదు కాదు, వైష్ణవి చైతన్య వయసు 32 ఏళ్ళు.. అంటూ కొందరు, సోషల్ మీడియా వేదికగా కొత్త వివాదానికి తెరలేపారు. ‘ఆడదాని వయసు, మగాడి జీతం.. ఈ రెండిటి గురించీ ప్రశ్నించకూడదు..’ అనేవారు వెనకటికి.
సినిమా హీరోయిన్లు, తమ వయసు గురించి ఎక్కడా ఓపెన్ అవడానికి ఇష్టపడేవారు కాదు ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇంటర్నెట్లో అన్ని వివరాలూ అందుబాటులో వుంటున్నాయి.
వైష్ణవి చైతన్య, తన వయసుని దాచుకునే రకం కాదు.! ఒకింత డేరింగ్ మెంటాలిటీనే ఆమెది.! అయినా, వైష్ణవి చైతన్యకి ముప్ఫై రెండేళ్లంటే ఎలా నమ్మగలం.? ఛాన్సే లేదన్నది చాలామంది అభిప్రాయం.
అయినా, ఇదేమన్నా జాతీయ సమస్యా.. ఇంత రచ్చ జరగడానికి.? అంటే, కాదేదీ సోషల్ మీడియాలో ట్రోలింగ్కి అనర్హం.. అదీ సంగతి.!
ఎలాగైతేనేం, ఈ వివాదంతో వైష్ణవి చైతన్య పేరు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా మార్మోగిపోతోంది. బర్త్ సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపించాలేమో ఇప్పుడు వైష్ణవి చైతన్య, తన వయసు విషయమై స్పష్టతనివ్వడానికి.
సినిమా జనాల మీద, వాళ్ళకు సంబంధించిన విషయాల మీదా.. సినీ అభిమానులకి ఒకింత ఆసక్తి ఎక్కువ.. సో, డిస్కషన్ కొనసాగుతూనే వుంటుంది ఇలాంటి విషయాలపై.
జస్ట్ ఫర్ ఫన్ అయితే ఫర్లేదు.. కానీ, ట్రోలింగ్ జుగుప్సాకరంగా మారితేనే.. విషయం చెయ్యిదాటిపోతుంది.