Home » ఏఐ వద్దు.! రియల్ ఫొటోలే ముద్దు: యామీ గౌతమ్ ధర్ స్వీట్ వార్నింగ్.!

ఏఐ వద్దు.! రియల్ ఫొటోలే ముద్దు: యామీ గౌతమ్ ధర్ స్వీట్ వార్నింగ్.!

by Mudra369 Editorial Desk
0 comments
Yami Gautam Dhar

Yami Gautam Dhar AI.. బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ధర్, స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది మీడియాకి. అదీ, సోషల్ మీడియా వేదికగా.! అసలేం జరిగింది.?

సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫొటోల్ని ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ టూల్స్ వినియోగించి మార్ఫింగ్ చేయడం మామూలే.!

ఈ మార్ఫింగ్ అసభ్యకరంగా మారుతున్నప్పుడు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేయడం కూడా సహజాతి సహజమే. అది తప్పు కూడా.! తప్పు మాత్రమే కాదు, మార్ఫింగ్ చేయడం నేరం.!

మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, ‘ఏఐ టూల్స్’ ద్వారా తయారు చేసిన ఫొటోల్ని వినియోగిస్తే.? ఈ మధ్య ఇదో కొత్త రోగం అయి కూర్చుంది.

తాజాగా, నటి జాన్వీ కపూర్ ‘డీప్ ఫేక్ వీడియో’ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరదా కోసం సాధారణ మార్పింగ్ ముచ్చటగానే వుండొచ్చు.. కానీ, ఇలా అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం నేరమే కదా.!

అసలంటూ, సరదా కోసమే అయినా, ఏఐ టూల్స్ ద్వారా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడమేంటి.? అన్న ప్రశ్న తెరపైకొచ్చిందిప్పుడు.

Yami Gautam Dhar
Yami Gautam Dhar

కొందరు సినీ ప్రముఖులు ఆల్రెడీ, న్యాయస్థానాల్ని ఆశ్రయించి, ఈ తరహా మార్ఫింగ్ కంటెంట్ విషయమై చట్ట పరమైన రక్షణ పొందారు. అయినప్పటికీ వాళ్ళ ఫొటోలు, వీడియోలూ మార్ఫింగ్ అవుతూనే వున్నాయి.

ఇక, తాజాగా బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ధర్, తన ఫొటోల్ని ఏఐ ద్వారా తయారు చేసి, ఉపయోగించకూడదంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అల్టిమేటం జారీ చేసింది.

నిజంగానే, ఇదో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్.. ఏఐ టూల్స్ వినియోగంతో ఫొటోలు, వీడియోలు తయారు చేయడానికి సంబంధించి.

ఈ తరహా కంటెంట్ కోసమే, పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు ఔత్సాహికులు. వాళ్ళ కోసమే రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తోంది కూడా.

వేల కోట్ల, లక్షల కోట్ల వ్యాపారం దిశగా ఈ ఏఐ టూల్స్ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఏఐ టూల్స్ వినియోగమంటే, కోడింగ్ సహా కీలక విభాగాల్లో ‘సులభతర’ మెళకువల కోసం అద్భుతంగా వుంటుంది. అది మళ్ళీ వేరే చర్చ.

ఎంటర్టైన్మెంట్ విభాగంలో గనుక ఏఐ టూల్స్ మీద నిషేధాజ్ఞలు పెరిగిపోతే, మొత్తంగా ఈ ‘వ్యాపారం’ మూతపడినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group