Aparna Balamurali.. చీమా చీమా ఎందుకు కుట్టావ్.? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చీమ అంది.! ఈ కథ చాలామంది వినే వుంటారు కదా.!
నువ్వు ఎవరితో డేటింగ్ ఇష్టపడతావ్.? నువ్వు ఎవర్ని లవ్ చేస్తావ్.? ఎన్నిసార్లు ‘సె..’ చేశాడ్.? ఇలాంటి ప్రశ్నలకు సెలబ్రిటీలు మెలితిరుగుతూ సమాధానాలిచ్చేస్తుంటారు.
సినీ జనాలు చేసే పబ్లిసిటీ స్టంట్లు జనాల్లో వింత వింత కోరికలకు కారణమవుతుంటాయ్. మరీ ముఖ్యంగా అందాల భామలు జనాల్లోకి వెళితే, అసభ్యకరమైన పనులు వారితో చేస్తుంటారు ఆకతాయిలు.
Aparna Balamurali.. ఫాఫం అలా బుక్కయిపోయింది..
తాజాగా మలయాళ నటి అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం ఓ కళాశాలకు వెళితే, అక్కడ ఓ ఔత్సాహిక విద్యార్థి.. ఆమెకు గులాబీ ఇచ్చాడు.
మీడియా ముందు సరదాగా ఆమెకు ప్రపోజ్ చేస్తున్నట్లుగా కనిపించాడు. అంతలోనే, చటుక్కున ఆమె వెనకాల చెయ్యి వేశాడు. దగ్గరకు తీసుకున్నాడు.

నడుము మడతలో గట్టిగా నొక్కేశాడా కుర్రాడు.! ఇదంతా అస్సలు ఊహించని అపర్ణ బాలమురళి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది.
వెంటనే అతన్ని పక్కకి తోసేసింది. ఈ వ్యవహారంపై సదరు కాలేజీ యాజమాన్యం కూడా సీరియస్ అయ్యింది. ఆ విద్యార్థి మీద చర్యలు తీసుకుంది.
తప్పెవరిది.?
అందగత్తెలు జనంలోకి రాకూడదా.? అంటే, ఎందుకు రాకూడదు.. రావొచ్చు. కాకపోతే, వెకిలి వేషాలు వేయడం హీరోయిన్లే కాదు.. హీరోలూ తగ్గించుకోవాలి.
ఇక్కడ, సదరు విద్యార్థి చేసిన చర్యని ఎవరూ సమర్థించరు. నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సినీ జనాల అత్యుత్సాహం.. ఇవన్నీ ఇలాంటి ‘కొంటె పనులకు’ తావిస్తాయి.
Also Read: డబ్బు కోసమే సినిమా.! అయితే తప్పేంటట?
గతంలో సినీ నటి జ్యోతికకూ ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. చాలామంది నటీమణులు ఇలాంటి ఘటనల్లో బాధితులే. కొందరైతే, చాచి చెంప దెబ్బ కొట్టారు ఆకతాయిల్ని.
అపర్ణ మాత్రం సంయమనం పాటించింది.! ఆమె సంయమనం అర్థం చేసుకోదగ్గదే. ఆకతాయి చర్య మాత్రం సమర్థనీయం కాదు.