Honey Rose Glass Party.. నందమూరి బాలకృష్ణ సరసన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించిన మలయాళ బ్యూటీ హనీ రోజ్ పేరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
సినిమాలో ఆమె పాత్ర గురించి కాదు.. గ్లాస్ పార్టీ సందర్భంగా బాలయ్యతో హనీ రోజ్ నడిపిన వ్యవహారాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
‘వీర సింహా రెడ్డి’ సక్సెస్ పార్టీ సందర్భంగా బాలకృష్ణ, హనీ రోజ్.. ‘గ్లాసులతో’ కనిపించారు. ఒకరి గ్లాసులోని డ్రింక్, ఇంకొకరు తాగుతూ.. ఎంజాయ్ చేశారు. అంటే, పరస్పరం గ్లాసులు షేర్ చేసుకున్నారన్నమాట.
Honey Rose Glass Party హనీ రోజ్.. మత్తు మత్తుగా..
తెలుగులో హనీ రోజ్ (Honey Rose) చాలాకాలం క్రితమే తెరంగేట్రం చేసింది. కానీ, ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమాతోనే.
మొన్నామధ్యన మలయాళ సినిమా ‘మాన్‌స్టర్’ తెలుగు వెర్షన్‌తో కూడా హనీ రోజ్ (Honey Rose) టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
బాలయ్యను భలే పటాయించావులే..
బాలయ్య అంటేనే మాన్షన్ హౌస్.! ఆ బాలయ్యతో కలిసి ‘మాన్షన్ హౌస్’ లాగించేశావా.? మొత్తానికి బాలయ్యని భలే పటాయించావ్.. అంటూ హనీ రోజ్ మీద బాలయ్య అభిమానులే కామెంట్లేస్తున్నారు.

అన్నట్టు, తనతో పని చేసిన హీరోయిన్లని రిపీట్ చేయడం బాలయ్యకు అలవాటే. సోనాల్ చౌహన్ (Sonal Chauhan), రాధికా ఆప్టే (Radhika Apte) అలా రిపీట్ అయిన భామలే.
సో, ఆ లిస్టులో హనీ రోజ్ కూడా చేరిపోతుందా.? ఈ గ్లాస్ బంధం చూస్తోంటే, తక్కువలో తక్కువ ఓ నాలుగైదు సినిమాలు.. ఇద్దరూ కలిసి చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో.!
Also Read: Dhamaka OTT Review.. తిట్టిపోస్తున్నారేంటబ్బా.!
అదే జరిగితే, తెలుగులో హనీ రోజ్ (Honey Rose) దశ తిరిగినట్లే.! అనారోగ్య సమస్యలతో ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమా ప్రమోషన్లకు శృతిహాసన్ దూరంగా వుండడం హనీ రోజ్‌కి కలిసొచ్చింది.
అన్నట్టు, ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.