Divi Vadthya Mermaid.. ఎవరీ అందాల మెర్మైడ్. అదేనండీ జలకన్య.. అనుకుంటున్నారా.?
అందరికీ సుపరిచితురాలే. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తోంది.
పేరు దివి వైద్య. అన్నీ కలిసొస్తే హీరోయిన్ అయిపోదగ్గ పీచర్స్ వున్న కటౌట్. అమ్మడి కటౌట్‌కి కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా అవస్థ పడిపోతుంటారంటే అతిశయోక్తి అనిపించదేమో.,
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుణ్యమా అని, ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమాలో ఓ మంచి రోల్ పట్టేసింది. ఆ రోల్ దివికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌లో కనిపించి మెప్పిస్తోంది. అలాగే, కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్.. ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేస్తుంటుంది దివి వైద్య.
Divi Vadthya Mermaid.. గ్లామర్ జిల్ జిల్.!
హీరోయిన్‌గా రాణించాలన్న కోరిక అప్పుడే తీరకపోయినా, అంతకు ఏ మాత్రం తగ్గని క్రేజ్‌తో నెట్టింట దూకుడు ప్రదర్శిస్తుంటుంది అందాల దివి (Divi Vadthya) పాప.
ముంబై బ్యూటీస్‌కి తానేం తక్కువ.? అన్నట్లుగా హాట్ అండ్ వైల్డ్ ఫొటో సెషన్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తూనే వుంటుంది దివి.
Also Read: Adah Sharma The Kerala Story.. దెబ్బకి దశ తిరిగిపోయింది.!
ఎప్పటికప్పుడు నయా నయా గ్లామర్ పోజులతో కుర్రకారుకు కిర్రాకెత్తిస్తుంటుంది. తాజాగా మెర్మైడ్ (జలకన్య) దుస్తుల్లో దివి పాప చేస్తున్న హాట్ హల్‌చల్‌కి ఫిదా అయిపోతున్నారు నెటిజనం.

నిజమే.! ఈ జలకన్య గెటప్‌లో దివి అందాలు.. చూపు తిప్పుకోనీయడం లేదంతే. గెటప్ ఏదైనా సరే, గ్లామర్ మిస్ కాకుండా చూసుకునే దివి (Divi Vadthya) పాప, ఈ మెర్మైడ్ దుస్తుల్లో మరింత అందాల విందు చేస్తోంది.
అందుకే ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్. సినిమాల సంగతెలా వున్నా, మ్యూజిక్ వీడియోలతో దివి బాగానే తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.