Krithi Shetty Bad Time.. ఆమెని ఎవరో టార్గెట్ చేశారు.! అంతలా టార్గెట్ చేయడానికి ఆమె ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళలేదు కదా.!
ప్చ్.. బేబమ్మ కష్టం పగవాడిక్కూడా రాకూడదు.! కెరీర్లో ఒకప్పుడు అనూహ్యంగా దూసుకెళ్ళిన కృతి శెట్టి, ఇప్పుడు కాస్త డీలాపడినట్లే కనిపిస్తోంది.
ఐరన్ లెగ్.. గోల్డెన్ లెగ్.. ఈ ‘తోకలు’ చాలా తేలిగ్గా వచ్చేస్తుంటాయ్.. అందునా, హీరోయిన్లకు ఇంకా తేలిక.! సినిమా పరిశ్రమ అంటేనే అంత.! హిట్టొస్తే ఒకలా.. ఫ్లాపొస్తే ఇంకోలా.!
Krithi Shetty Bad Time.. కృతి శెట్టికి ఏమయ్యింది.?
ఓ యంగ్ హీరో కృతి శెట్టితో అసభ్యకంగా ప్రవర్తించాడట. అది కూడా ఓ స్టార్ హీరో కొడుకు అట.! అలాగని కృతి శెట్టి చెప్పిందట.!

జస్ట్ ఇదంతా ఓ పుకారు మాత్రమే. కానీ, అది చేసిన డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఫలానా హీరోనే కృతి శెట్టిని ఏడిపించాడంటూ మార్పింగ్ ఫొటోలతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది.
డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగిన కృతి శెట్టి, అలాగని తానెక్కడా చెప్పలేదనీ, తానెప్పుడూ వేధింపులకు గురి కాలేదనీ వివరణ ఇచ్చుకుంది.
ట్రోలింగ్ బీభత్సం..
కానీ, సదరు యంగ్ హీరో అభిమానులు కృతి శెట్టిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తమ హీరోని కృతి శెట్టి బదానం చేసిందన్నది వారి ఆవేదన.
అస్సలేమాత్రం తనకు సంబంధం లేని వివాదంలో కృతి శెట్టి (Krithi Shetty) ఇరుక్కుపోయింది. టైమ్ బ్యాడ్ అంటే ఇదే మరి.!

అయినా, మరీ ఇంత బ్యాడ్ టైమ్ నడుస్తోందేంటి కృతి శెట్టికి.! ఉప్పెనలా తెలుగు తెరపైకి దూసుకొచ్చిన ఈ అందాల భామ.. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేదెప్పుడో.!
Also Read: పవన్ కళ్యాణ్‌కి జ్వరమొస్తే.! వాళ్ళకేమో రాజకీయ రోగమొచ్చె.!
ఇప్పుడైతే తెలుగుతోపాటు, పలు ఇతర భాషల్లోనూ ట్రై చేస్తోంది కృతి శెట్టి (Krithi Shetty). టైమ్ కలిసొస్తే.. స్టార్డమ్ అనూహ్యంగా మళ్ళీ ఆమెకు వచ్చేయదూ.? అదెంత పని.!