Table of Contents
Pawan Kalyan People Agenda.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎందుకు, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు.?
పవన్ కళ్యాణ్ కంటే ముందు, 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తే, ఓ చోట ఓడిపోయాడు.?
రాజకీయం అంటే, అది వేరే.! రాజకీయమంటే ప్రజల్ని ఏమార్చాలి.. మోసం చెయ్యాలి.! మోసం చెయ్యడం చేతనైతేనే, రాజకీయ నాయకుడవగలరు ఎవరైనా ఈ రోజుల్లో.!
Pawan Kalyan People Agenda.. ఐదేళ్ళకోసారి మోసపోతూనే వుంటారు..
మోసం.. రాజకీయం.. ఈ రెండూ అవిభక్త కవలల్లాంటివి.! ఐదేళ్ళకోసారి ప్రజలు మోసపోతుంటారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

‘మేం అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం..’ అని చెప్పని రాజకీయ పార్టీని చూశామా.? మరి, గెలిచి.. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాయి ఆయా పార్టీలు.?
జనం ఎందుకు నిలదీయరు.? రాజకీయ పార్టీలకు ఎందుకు బుద్ధి చెప్పరు.? చెబుతారు, కానీ.. ఇంకోసారి కొత్తగా మోసపోతారంతే.!
మోసం చేతకావడంలేదు జనసేనానికి..
మోసం చేయడం జనసేన అధినేతకు చేతకావడంలేదు. అంతకు ముందు చిరంజీవికి కూడా చేతకాలేదు.!
ఎన్నికల్లో ఓడిపోయినా, ప్రజల కష్టాల్ని చూసి చలించిపోతున్నారు జనసేనాని. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాల్ని ఆదుకుంటున్నారు.

‘మీరిలా నష్టపోతున్నారు..’ అంటూ ప్రజలకు, పాలకులు చేస్తున్న మోసాన్ని సవివరంగా తెలియజేయడం, జనసేనాని చేస్తున్న అతి పెద్ద తప్పేమో.!
ప్రజాధనం ఎలా దుర్వినియోగమవుతోందో సవివరంగా జనసేనాని చెబుతున్నా, జనానికి అది నచ్చడంలేదు.
ప్రజాధనం అంటే ఏంటి.?
అసలు ప్రజాధనమంటే, ప్రజలకు చెందినది.. అన్న భావన ప్రజల్లో ఎందుకు రావడంలేదు.? కులం, మతం, ప్రాంతం.. ఇవే రాజకీయాల్ని శాసిస్తున్నాయ్.
మోసాలు, కుట్రలు, కక్ష సాధింపు చర్యలు.. ఇదీ నేటి రాజకీయం. అధికార పీఠమెక్కడమంటే, ప్రజాధనాన్ని దోచుకోవడం. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చడం.
ఈ తరహా మోసపు రాజకీయాలు చేయడం జనసేన అధినేతకు చేతకాకపోవడం వల్లే ఆయన ఓడిపోయారేమో.! ప్రజల్లో చైతన్యం వస్తుందనుకోవడం పవన్ కళ్యాణ్ భ్రమ.!
Pawan Kalyan People Agenda.. ఎవడబ్బ సొమ్మనీ..
ప్రజాధనం నుంచి కోట్లాది రూపాయల్ని సొంత మీడియా సంస్థలకి తరలించుకుంటున్న ప్రభుత్వాలు.. సలహాదారుల పేరుతో రాజకీయ నిరుద్యోగుల్ని మేపుతున్న ప్రభుత్వాలు.! ఇదంతా ఓ వైపు.!
నెలకు ఐదు వేల రూపాయల వేతనానికి పనిచేసే వాలంటీర్లు.. పైగా, అధికార పార్టీ కార్యకర్తలే అందులో మెజార్టీ.! వారి భుజాల మీద తుపాకులు పెట్టి, జనసేనాని మీద విమర్శల తూటాలు పేల్చడం.! ఇదీ నేటి రాజకీయం.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
సంక్షేమ పథకాలకి సొంత పేర్లు.. ఏ ప్రభుత్వం ఈ పని చేసినా అది తప్పే.! ఎవడబ్బ సొమ్మనీ.. అని జనం నిలదీయనంతకాలం.. ఈ పెత్తందారీతనం కొనసాగుతూనే వుంటుంది.

ఓటరూ.. నీ భవిష్యత్తు నాశనమైంది.. నీ బిడ్డ భవిష్యత్తూ నాశనమవుతోంది.. అని బాధ్యతతో హెచ్చరించే నాయకుడు పవన్ కళ్యాణ్ కాక ఇంకెవరు.?
వస్తుంది.. కోపం వస్తుంది.. ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.. నాయకులు వందల కోట్లకు, వేల కోట్లకు పడగలెత్తుతోంటే.. ప్రజలు బిచ్చగాళ్ళలా సంక్షేమ పథకాల కోసం ఎదురుచూస్తోంటే.. జనసేనానికి కోపం రావడంలో ఆశ్చర్యమేముంది.?