Niharika Konidela Nagababu Sutthhi.. విషయమేమో సీరియస్.. నిహారిక చెప్పిందేమో ‘సుత్తి’ అని.! నిహారికకి నాగబాబు తండ్రే కావొచ్చు.! కానీ, జనసేన పార్టీకి ఇప్పుడాయన ఓ బలమైన ‘పిల్లర్’.!
జనసేన పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాల్ని కొణిదెల నాగబాబు చూసుకుంటున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటా, ఆయన వేసే ప్రతి ట్వీటూ.. చాలా చాలా జాగ్రత్తగా వుండాలి, వుంటాయ్ కూడా.!

కొన్నాళ్ళ క్రితం అల్లు అర్జున్ (Allu Arjun), నంద్యాల వెళ్ళాడు.. తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి ‘నైతిక మద్దతు’ ఇచ్చేందుకు.
సరే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan Kondala) తన కుటుంబ సభ్యుడు గనుక, ఆయన గెలుపుని కాంక్షిస్తానంటూ అల్లు అర్జున్ చెప్పడం.. అది వేరే చర్చ.
ఆ రచ్చ వేరే లెవల్ అంతే..
ఈ క్రమంలో పెద్ద రచ్చే జరిగింది నిజానికి. నాగబాబు తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ కూడా వైరల్ అయ్యింది అప్పట్లో. పెద్ద వివాదంగా మారడంతో, ఆ ట్వీటుని నాగబాబు తొలగించారు కూడా.
ఆ ట్వీట్ ఏంటి.? అన్నది ఇక్కడ అప్రస్తుతం. కానీ, ఆ వివాదంపై మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు, కూతురిగా ఒకింత బాధ్యతతో వ్యవహరించి వుండాల్సింది నిహారిక.

‘ఆయన ఏవేవో ట్వీట్లు వేస్తుంటారు.. వాట్సాప్లో కూడా అంతే ‘సుత్తి’..’ అంటూ తేలిగ్గా నిహారిక మాట్లాడేయడం వైరల్ అవుతోంది.
Niharika Konidela Nagababu Sutthhi.. టార్గెట్ సుత్తి.!
ఈ ‘సుత్తి’ వ్యాఖ్యల్ని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. నాగబాబుని టార్గెట్ చేస్తున్నాయి.. నాగబాబుని తేలిగ్గా చూపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో.. అందునా, డిప్యూటీ సీఎం హోదాలో వున్నారన్న విషయాన్ని గుర్తెరిగి.. మెగా కుటుంబ సభ్యులు.. తాము మాట్లాడేటప్పుడు.. ఆయా విషయాలు రాజకీయ కోణంలో వివాదాస్పదమవుతాయేమోనని ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడితే మంచిది.
Mudra369
తండ్రి నాగబాబుతో కూతురిగా నిహారికకి వున్న ‘అతి’ చనువు కారణంగా ఇలాంటి తేలిక ‘సుత్తి’ మాటలు వేరే సందర్భాల్లో వస్తే, అది వేరే వ్యవహారం.

Also Read: Varsha Bollamma: విడాకులకు కారణమేంటో తెలుసా.?
కానీ, ట్వీటుని డిలీట్ చేసుకునేలా నాగబాబు మీద ఒత్తిడి.. మెగా కుటుంబంలో అలజడి.. ఇంత పెద్ద వివాదంపై, నిహారిక అలా ఎలా ‘సుత్తి’ వ్యాఖ్యలు చేసినట్లు.?
రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న జనసేన పార్టీ మీద ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయని అనుకోలేంగానీ, రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ‘సుత్తి’ అస్త్రాన్ని నిహారిక అందించినట్లయ్యిందన్నది మాత్రం నిర్వివాదాంశం.