Pawan Kalyan 6Cr Donation.. తెలుగు రాజకీయాల్లో.. ఆ మాటకొస్తే, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా, ప్రజా ప్రతినిథిగా మారాక.. మంత్రి పదవిలో కూర్చున్నాక.. తన శాఖ కోసం స్వార్జితాన్ని ‘సాయం’ చేసినట్లు చరిత్రలో వుందా.?
లేదు.. లేదు.. లేదు.! కానీ, ఒక్కడు.. చరిత్ర సృష్టించాడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! ఔను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా భారీ విరాళాన్ని ప్రకటించారు.
ఇటీవల విజయవాడ నగరంలో సంభవించిన వరదల నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారాయన.
Pawan Kalyan 6Cr Donation.. సాయానికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్..
అంతటితో ఆగలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా మరో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
అంతేనా, వరదల వల్ల నష్టపోయిన సుమారు 400 పంచాయితీలకు, ఒక్కో పంచాయితీకీ లక్ష రూపాయల చొప్పున.. మొత్తంగా నాలుగు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు జనసేనాని.
ఏపీకి కోటి రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించగానే, తెలంగాణని వదిలేసుకున్న పవన్ కళ్యాణ్.. అంటూ వెకిలి రాతలు మొదలెట్టారు కొన్ని పాత్రికేయ వ్యభిచారులు.! తెలంగాణకీ కోటి రూపాయలు ప్రకటించాక, ‘విమర్శల తాకిడి తట్టుకోలేక’ అంటూ మరింత పాత్రికేయ వ్యభిచారాన్ని సోకాల్డ్ ‘ఫేకు’ మీడియా చాటుకుంది.!
Mudra369
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ‘సాయం చేయడం’ అనేది కొత్త విషయం కాదు.! కాకపోతే, ఈసారి సాయం.. ఆయన, డిప్యూటీ సీఎం హోదాలో చేశారు. అదే ప్రత్యేకత.
ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, అందరికన్నా తానే ముందుండి.. బాధితులకు సాయం చేయడానికి తనవంతుగా విరాళాలు అందిస్తుంటారు జనసేనాని.
సినిమాల్లో సంపాదన.. జనం కోసం.!
సినీ రంగంలో సంపాదించిన రెమ్యునరేషన్‌ని, తన వ్యక్తిగత అవసరాల కంటే మిన్నగాగా, ఆపదలో వున్నవారికి సాయమందించేందుకే పవన్ కళ్యాణ్ వినియోగిస్తుంటారు.
కుల జాడ్యంతో, ఎవడో పోసిన మూత్రం తాగి బతికే ‘ఫేకు పాత్రికేయ వ్యభిచారులకు’, పవన్ కళ్యాణ్ మీద నిత్యం అసత్య ప్రచారం చేయడమే పని.
Mudra369
అధికారం లేకపోయినా, పోటీ చేసిన రెండు చోట్లా జనసేనాని పవన్ కళ్యాణ్‌ని 2019 ఎన్నికల్లో ప్రజలు ఓడించినా, ఆ ప్రజలకే ఆయన అండగా నిలిచాడు.
కౌలు రైతుల కష్టాల్ని చూసి చలించిపోయి, పవన్ కళ్యాణ్ చేసిన కోట్లాది రూపాయల సాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
Also Read: సింగిల్ సింహం.! ఎంత నిజం.?
చివరగా.. పవన్ కళ్యాణ్‌కి ఓ విన్నపం.! సమయం చూసుకుని, సినిమాలు చేయండి.! అలా సినిమాల ద్వారా సంపాదించేది జనం కోసమే గనుక, సినిమాల్లో నటించడం మాత్రం ఆపొద్దు.!