Naina Ganguly Dirty Picture.. నైనా గంగూలీ తెలుసా.? రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బెంగాలీ బ్యూటీ.
‘వంగవీటి’ సహా, పలు తెలుగు సినిమాల్లో నటించిన నైనా గంగూలీ, తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ నటించింది.
నవీన్ చంద్ర, శరత్ కుమార్ తదితరులు నటించిన ‘పరంపర’ అనే వెబ్ సిరీస్‌లోనూ నైనా గంగూలీ కీలక పాత్రలో నటించి మెప్పించింది.
ఎక్కువగా గ్లామరస్ రోల్స్ మాత్రమే చేసింది నైనా గంగూలీ. సోషల్ మీడియాలోనూ నైనా గంగూలీ యాక్టివ్‌గా వుంటుంది.
Naina Ganguly Dirty Picture.. ప్రేమ వేధింపులు..
మొన్నీమధ్యనే నటి ఫ్లోరా శైనీ, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో కోసం వచ్చినప్పుడు, తన ‘డర్టీ లవ్ స్టోరీ’ గురించి చెప్పుకొచ్చింది.
తన ప్రియుడు, తనను చావగొట్టేవాడనీ, శారీరకంగా అలానే మానసికంగా హింసించాడనీ, ఆ నరకం నుంచి తాను బయటపడ్డాననీ కంట తడి పెడుతూ వచ్చింది.

సేమ్ టు సేమ్.. ఇలాంటి ‘డర్టీ స్టోరీ’నే నైనా గంగూలీ కూడా చెప్పింది. అయితే, అది సోషల్ మీడియా వేదికగా కావడం గమనార్హం.
ఓ కొరియోగ్రాఫర్‌తో కొన్నాళ్ళపాటు ప్రేమలో వుందిట నైనా గంగూలీ. అతను, తనను శారీరకంగా అలానే మానసికంగా వేధించాడంటూ నైనా గంగూలీ పేర్కొంది?
పోలీసులకు ఫిర్యాదు చేసిందా.?
తనను వేధింపులకు గురిచేసిన కొరియోగ్రాఫర్‌పై నైనా గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా.? అని, ఆమెకి నెటిజనం కొందరు సూచిస్తున్నారు.
మరోపక్క, సదరు కొరియోగ్రాఫర్ శిష్యురాలి నుంచి, నైనా గంగూలీకి కౌంటర్ ఎటాక్ వస్తోంది. ఈ విషయాన్ని కూడా, నైనా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేస్తుండడం గమనార్హం.

నిజానికి, ఈ తరహా వేధింపులు గ్లామరస్ ప్రపంచంలో చాలా చాలా ఎక్కువే. తెలిసీ, ఆ ‘డర్టీ లవ్’ ఉచ్చులో కొందరు పడుతుంటారు.
Also Read: కన్యాకుమారి సమీక్ష.! సిక్కోలు ‘సిన్నది.. సిన్నోడు’ బావున్నారు.!
‘తప్పు రెండు వైపులా వుంటోంది.. ప్రేమలో వున్నప్పుడు అంతా బాగానే వున్నా.. విడిపోయాక పరస్పర ఆరోపణలు అత్యంత జుగుప్సాకరంగా చేసుకుంటున్నారు’ అనే వాదనా లేకపోలేదు.
ఇంతకీ, నైనా గంగూలీ విషయంలో తప్పెవరిది.? ఆమె ఆరోపణలు నిజమేనా.? ఏమో.. అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
