Ys Jagan Assembly Walkout.. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసన సభ్యుడిగా శాసన సభ సమావేశాలకు హాజరవ్వాలంటే భయంతో వణికిపోతున్నారు.!
ఇది కూటమి పార్టీల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న తీవ్రాతి తీవ్రమైన విమర్శ.! మామూలుగా అయితే, ఈ వ్యవహారాన్ని వైఎస్ జగన్ ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకోవాల్సి వుంది.
కానీ, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ వైఎస్ జగన్ మొండికేస్తున్నారు. కాదు కాదు, తప్పించుకు తిరుగుతున్నారు.
ఎక్కడ శాసన సభ సభ్యత్వం రద్దవుతుందోనని, తాజాగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయినట్లే అయి, జస్ట్ పదకొండు నిమిషాల్లో బయటకు వచ్చేశారు.
శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యేముందు గవర్నర్ ప్రసంగం వుంటుంది. ఆ ప్రసంగం మధ్యలోనే వైఎస్ జగన్ సహా వైసీపీ శాసన సభ్యులంతా (మొత్తంగా 11 మంది), ‘బాయ్‌కాట్’ చేసి బయటకు వచ్చేశారు.
ప్రతిపక్ష హోదా అడిగితే ఇవ్వరంటూ ఓ ప్లకార్డు పట్టుకుని వైఎస్ జగన్, అసెంబ్లీ దగ్గర హంగామా చేశారు వైఎస్ జగన్.
వైసీపీకి మొత్తంగా 11 మంది శాసన సభ్యులే వున్నారు. అయినాసరే, ఒక్కడు చాలు.. అసెంబ్లీలో సత్తా చాటడానికి. కానీ, వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్ళేందుకు ఇష్టపడ్డంలేదు.
164 మంది కూటమి సభ్యులు సభలో, తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా వుంటుందో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు.
గతంలో వైసీపీకి 151 మంది శాసన సభ్యులున్నప్పుడు, అధికార పక్షం హోదాలో వైఎస్ జగన్ ప్రదర్శించిన దురహంకారమే, ఇప్పుడాయన్ని సిగ్గుతో అసెంబ్లీకి డుమ్మా కొట్టేలా చేస్తుంది.
రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. అసెంబ్లీకి వెళ్ళాలి. ఎంత సమయం దొరికితే అంత సమయం, అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీయగలగాలి.
ఈ క్రమంలో అవమానాలు ఎదురైతే, ఎదుర్కొనాలి.. అప్పుడే, ప్రజలూ జగన్ మోహన్ రెడ్డికి జరిగే అవమానాల్ని తెలుసుకుంటారు. గతంలో చంద్రబాబుకి ఇలాగే, ప్రజల నుంచి సానుభూతి లభించింది.
నిజానికి, ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్.. కానీ, సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు.? అని ప్రజలే నిలదీస్తున్నారు.
పులివెందుల ప్రజలు ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే, 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్, సొంత నియోజకవర్గంలో ఓడిపోవాల్సి వస్తుంది.
