Home » కిరికెట్టు పైత్యం.! టీ20 వరల్డ్ కప్ వేస్టు.. ఐపీఎల్ బెస్టు.!

కిరికెట్టు పైత్యం.! టీ20 వరల్డ్ కప్ వేస్టు.. ఐపీఎల్ బెస్టు.!

by hellomudra
0 comments
IPL T20 Worldcup

World T20 Cup IPL.. క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్.! కానీ, అది టెస్టు మ్యాచుల విషయంలోనే. వన్డే మ్యాచ్‌ల విషయానికొస్తే, లెక్కలు మారిపోతాయ్.!

టీ20 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.! కానీ, ఇప్పుడు టీ20 మ్యాచ్‌ల గురించే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తోంది.

ఐదు రోజులపాటు టెస్ట్ మ్యాచ్ సుదీర్ఘంగా జరుగుతుంది. ఎంత ఓపిగ్గా ఆడితే, అంత మంచిది టెస్ట్ క్రికెట్‌లో. వన్డే కాస్త బెటర్. టీ20 అయితే, దారుణాతిదారుణం.

ఎప్పుడైతే, క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసం.. అనే భావన మొదలైందే, అప్పటినుంచీ టీ20 ఫార్మాట్‌కి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.

World T20 Cup IPL.. క్రికెట్‌ని ఆస్వాదించడం మానేసి..

సరిగ్గా ఇదే సమయంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద యువతలో ఆసక్తి షురూ అయ్యింది. క్రికెట్‌ని ఆస్వాదించడం మానేసి, బెట్టింగుల కోసం ఐపీఎల్ చూడటం మొదలు పెట్టారు.

వాస్తవానికి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా, దేశవ్యాప్తంగా యువ టాలెంట్‌ని ప్రోత్సహించాలనే ఆలోచన చేశారు. కానీ, ఆలోచన వేరు, ఆచరణలో జరుగుతున్నది వేరు.

టీ20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నా, యువతలో పెద్దగా ఆ పోటీల పట్ల ఆసక్తి లేదు. త్వరగా టీ20 ముగిసిపోతే బావుణ్ణు.. ఎంచక్కా, ఐపీఎల్ చూసుకోవచ్చనే ఉద్దేశ్యంతో వుంది నేటి యువత.

పైగా, టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో, క్రికెటర్ల మీద ‘ఐపీఎల్ కోణంలో’ సెటైర్లూ ఎక్కువైపోయాయి. ఫలానా ఆటగాడు, ఫలానా ఐపీఎల్ జట్టు.. ఇదీ నడుస్తున్న తీరు.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే, ఇంత చప్పగా.. మ్యాచ్‌ల విషయమై జనం చర్చించుకుంటున్న తీరు అత్యంత దారుణం.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

టీమిండియా తలపడుతున్న మ్యాచ్‌లనే పట్టించుకునే వారు కనిపించడంలేదంటే, పరిస్థితి ఎంత దారుణంగా వుందో కదా.!

ధోనీ, విరాట్, రోహిత్.. ఇలా స్టార్ క్రికెటర్ల అభిమానులు.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం.. సోషల్ మీడియా వేదికగా ఆయా క్రికెటర్లను జట్ల వారీగా ట్రోల్ చేయడం ఇదీ ఐపీఎల్ అంటే.

వెరసి ఐపీఎల్ అంటేనే జుగుప్స, అసహ్యం.. అన్నట్లు తయారైంది పరిస్థితి. కానీ, అదే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group