Rajendra Prasad Sorry Again.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంకోసారి క్షమాపణ చెప్పారు. నోటికొచ్చింది వాగడం, క్షమాపణ చెప్పడం.. ఇదో ప్రసహనంగా తయారైంది.
తప్పు మీద తప్పు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. అయినా సరే, రాజేంద్ర ప్రసాద్ అంటే, చాలామందికి గౌరవం. సినీ నటుడిగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అలాంటివి.
కమెడియన్‌గా, కామెడీ హీరోగా, విలక్షణ నటుడిగా.. రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో పోషించిన వైవిద్యభరితమైన పాత్రలు.. ఆయనకు తిరుగులేని నటుడిగా కీర్తి ప్రతిష్టలు అందించాయి.
ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారం కూడా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని వరించింది.
Rajendra Prasad Sorry Again.. వేదిక ఎక్కితే అభ్యంతకర పద జాలమే..
ఏం లాభం.? రాజేంద్ర ప్రసాద్, ఏదన్నా వేదిక మీద మాట్లాడితే చాలు, తన పరువు తానే తీసేసుకుంటున్నారు.. అసందర్భ ప్రేలాపనలతో.
ఆ మధ్య ఓ క్రికెటర్ మీద (డేవిడ్ వార్నర్) అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్.. వివాదం ముదిరి పాకాన పడ్డంతో క్షమాపణ చెప్పారు.
సహ నటుల మీద నోటికొచ్చింది మాట్లాడుతున్నారు రాజేంద్ర ప్రసాద్.. తప్పు చేయడం, క్షమాపణ చెప్పడం.. ఇదంతా ఓ ప్రసహనంగా తయారైంది.
తమిళ సినీ నటుడు, రాజకీయ ప్రముఖుడు దివంగత ఎంజీఆర్ మీద తాజాగా రాజేంద్ర ప్రసాద్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దాంతో, తమిళ సినీ పరిశ్రమ భగ్గుమంది.
చేసేది లేక, రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పారు.. అదీ, తమిళంలో. అనుకోకుండా పొరపాటు మాటలు దొర్లాయనీ, ఎంజీఆర్ అంటే తనకు బోల్డంత గౌరవమని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్, ఆ క్షమాపణ వీడియోలో.
ఇలా రాజేంద్ర ప్రసాద్‌ని చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు, సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని ఇలా మంటగలిపేసుకోవడం భావ్యమా.? అన్నది వారి ఆవేదన.
‘దయచేసిన సినీ వేదికలపైనా, ఇతర వేదికలపైనా రాజేంద్ర ప్రసాద్ గారికి మైక్ ఇవ్వొద్దు.. మైక్ ఇస్తే, మీరే ఆయనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లవుతుంది..’ అని రాజేంద్రుడి అభిమానులు సూచిస్తున్నారు ఈవెంట్ల నిర్వాహకులకి.
