Iran Israel USA War.. ఎవరిది యుద్ధోన్మాదం.? తప్పు చేసిందెవరు.? శిక్ష అనుభవిస్తున్నదెవరు.? యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది.. ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా దేశాలు.
కానీ, ఈ యుద్ధంలో నష్టపోయింది, పై మూడు దేశాలే కాకుండా, యూఏఈ సహా చాలా దేశాలు. ఆ మాటకొస్తే, యావత్ ప్రపంచం, ఈ యుద్ధం దెబ్బకి నష్టపోతోంది.
నిజానికి, యుద్ధం జరుగుతున్నది ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్యన. ఇజ్రాయెల్ తరఫున రంగంలోకి దిగింది అమెరికా. తమ మీద ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడులను తిప్పి కొడుతోంది ఇరాన్.
ఇరాన్ కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఇజ్రాయెల్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ లెక్కన మూడు దేశాలూ తప్పు చేస్తున్నట్లే.
Iran Israel USA War.. మోడ్రన్ యుద్ధం.. అందరికీ నష్టం..
ఒకప్పటి యుద్ధాలు వేరు, ఇప్పుడు యుద్ధాలు వేరు. ఇది మోడ్రన్ యుద్ధ కాలం. ఎవరు యుద్ధానికి పిలుపునిచ్చినా, అందరూ నష్టపోవాల్సిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ లభ్యత తగ్గిపోయింది, దాంతో క్రూడాయిల్ ధరలూ పెరిగిపోయాయి ఈ యుద్ధం కారణంగా. భారత దేశం ఎదుర్కొంటున్న ఎల్పీజీ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాలా.?
ఎందుకు అనవసరంగా ఈ గొడవలోకి దిగాం.? అని అమెరికా విలవిల్లాడుతున్న పరిస్థితుల్నీ చూస్తున్నాం. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వేరు, ఈ యుద్ధం వేరు.
అందుకే, అనూహ్యంగా యుద్ధ రంగం కాస్త శాంతించింది. దాంతో, యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. దాదాపు 50 లక్షల కోట్ల సంపద ప్రపంచ వ్యాప్తంగా ఆవిరైపోయిందన్నది ఓ అంచనా.
దెబ్బ తిన్న అమెరికా..
పైకి చెప్పలేకపోతోందిగానీ, ఆయుధ సంపత్తి పరంగా అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యుద్ధంలో దెబ్బ తిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే, యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించేయాల్సి వచ్చింది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి. ఇది ఓ రకంగా అమెరికాకి ఇరాన్ కొట్టిన చావు దెబ్బ.. అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ నష్టపోయింది, ఇరాన్ కూడా నష్టపోయింది. కువైట్ సహా యూఏఈ, బహ్రెయిన్.. ఇలా చాలా దేశాలు దెబ్బ తిన్నాయి. తిలా పాపం.. తలా పిడికెడు.. ఇదీ ప్రస్తుత పరిస్థితి.
