Pawan Kalyan Standup Comedy.. తెలుగు రాష్ట్రాల్లో స్టాండప్ కామెడీ.. వివాదాస్పదమవుతోంది.
ప్రముఖుల ఇళ్ళల్లోని మహిళలే టార్గెట్‌గా ఈ స్టాండప్ కామెడీ ముసుగులో అసభ్యతను కొందరు రుద్దుతున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్‌ని, ఆయన కుటుంబ సభ్యుల్ని ప్రధానంగా ఈ స్టాండప్ కామెడీ టార్గెట్ చేయడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
పవన్ కళ్యాణ్ విడాకులు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కుమార్తె విడాకులు.. ఈ రెండు అంశాల్ని ప్రధానంగా చేసుకుని, ఇద్దరు స్టాండప్ కమెడియన్స్ చేసిన ‘రోత’పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Pawan Kalyan Standup Comedy.. పాత్రధారులు దొరికారు.. కుట్రదారులెక్కడ.?
కేసులు నమోదయ్యాయి.. నిందితుల అరెస్ట్ జరిగింది.. బెయిల్ మీద కూడా నిందితులు విడుదలయ్యారు. చేసిన ‘రోత’కి సంబంధించి, క్షమాపణ కూడా చెప్పేశారు.
ఇక్కడ, అసలు విషయమేంటంటే.. స్టాండప్ కామెడీతో రోత పుట్టించిన ఇద్దరూ, అన్యమతస్తులు. ఇక్కడ మతం కోణమెందుకు వచ్చింది.? అంటే, దానికీ పెద్ద కథే వుంది.
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా దెబ్బ తీసే కుట్రలు జరుగుతున్నాయి. అందుక్కారణం, పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మ పరిరక్షణ’కు నడుం బిగించడమే.
ఈ క్రమంలో, ప్రకాష్ రాజ్ లాంటి కొందరు అన్యమతస్తులు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం.
Also Read: ‘కపుల్ ఫ్రెండ్లీ’ సమీక్ష.! లిప్ లాక్స్ అవసరం లేదు కదా.!
రాముడు, లక్ష్మణుడిపై ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలిసిన విషయాలే. ఇవన్నీ, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో భాగమే.
ప్రకాష్ రాజ్ అయినా, స్టాండప్ కమెడియన్లు.. అయినా, వీళ్ళంతా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో పాత్రధారులే. అసలు సూత్రధారులెవరన్నది తేలాల్సి వుంది.
